స్టీవ్ స్మిత్ మోచేతికి గాయం
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడుతున్న స్టీవ్ స్మిత్ మోచేతికి తీవ్ర గాయమైందని, అతను కోలుకోవడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురికావడంతో ఐపీఎల్ 2018 సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.
మార్చి చివరి వారంతో
క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఉన్న విధించిన ఏడాది నిషేధం ఈ ఏడాది మార్చి చివరి వారంతో ముగియనుంది. దీంతో ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం కోసం వీరిద్దరూ ఎదురు చూస్తోన్ సమయంలో స్టీవ్ స్మిత్ ఇలా గాయపడటం క్రికెట్ ఆస్ట్రేలియాను ఆందోళనలో పడేసింది.
ఆదివారం స్వదేశానికి
బంగ్లా రాజధాని ఢాకా నుంచి స్టీవ్ స్మిత్ ఆదివారం స్వదేశానికి తిరిగి చేరుకోనున్నాడు. అనంతరం వెంటనే అతడు క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బందిని కలవనున్నాడు. ఏప్రిల్ 23 నాటికి క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టుని ప్రకటించాల్సి ఉంది. అయితే, అప్పటికి స్టీవ్ స్మిత్ కోలుకుంటాడో లేదో అనేది అనుమానంగా మారింది.
మార్చి 23 నుంచి భారత్‌లో ఐపీఎల్
డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో స్టీవ్‌స్మిత్‌ని తొలుత వేలంలోకి విడిచిపెట్టాలని రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ భావించింది. అయితే, సుదీర్ఘ చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుని టీమ్‌తో అతడిని అట్టిపెట్టుకుంది. తాజాగా స్మిత్ గాయం ఫ్రాంఛైజీని ఆందోళనలో పడేసింది. మార్చి 23 నుంచి భారత్‌లో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుంది.