న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్యాంపరింగ్ చేసి దొరికిపోయిన ఆస్ట్రేలియా (వీడియో)

Steve Smith has thrown Cameron Bancroft under a bus and his position is untenable

హైదరాబాద్: ఇప్పటికే రబడ-స్మిత్‌, వార్నర్‌-డికాక్‌ల మధ్య స్లెడ్జింగ్‌ శృతి మించడంతో ఐసీసీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు బెన్‌ క్రాప్ట్‌ మైదానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. ఆసీస్ క్రికెటర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్..బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తమ జట్టుకు ఎదురుగాలులు వీస్తున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడింది.

ఆ జట్టు ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ రెండో సెషన్లో బంతి ఆకారం దెబ్బ తీసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అతను పసుపు రంగులో ఉన్న చిన్న ప్లాస్టిక్‌ ముక్క లాంటి దాన్ని వేళ్ల మధ్య ఉంచుకుని బంతిని గోకడం కనిపించింది. బంతిని రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా మార్చేందుకు అతడిలా చేశాడు. మూడో రోజు(శనివారం) ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాన్‌క్రాఫ్ట్ ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు.

అంపైర్లకు అనుమానం వచ్చి అతడిని పిలిచి ప్రశ్నించారు. జేబుల్లో చేతులు పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుడిలా వారి వద్దకు వెళ్లాడు బాన్‌క్రాఫ్ట్‌. జేబులో ఏముందో చూపించమని అంటే అతను కళ్లద్దాల సంచిని తీసి చూపించాడు. కానీ అసలు విషయం ఏంటంటే.. బాన్‌క్రాఫ్ట్‌ అంతకుముందే అప్రమత్తం అయ్యాడు. అతను బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు డ్రెస్సింగ్‌ రూమ్‌లోని టీవీలో చూసిన కోచ్‌ లీమన్‌ కంగారు పడ్డాడు. వెంటనే డగౌట్‌ దగ్గర ఉన్న సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు మైదానంలోకి నీళ్లు తీసుకొని వెళ్లాడు.

మైదానంలో ఉన్న టీవీ స్క్రీన్‌లో ఆ దృశ్యాలు చూసిన బాన్‌క్రాఫ్ట్‌ జాగ్రత్త పడ్డాడు. అతను వెంటనే జేబులో ఉన్న ఆ పరికరాన్ని తీసి ప్యాంటు లోపల వేసుకున్నాడు. అయితే ఆ దృశ్యాలు కూడా కెమెరాలకు దొరికిపోయాయి. ఆస్ట్రేలియాకే చెందిన దిగ్గజ ఆటగాళ్లు అలన్‌ బోర్డర్‌, షేన్‌ వార్న్‌లతో పాటు గ్రేమ్‌ స్మిత్‌ తదితరులు బాన్‌క్రాఫ్ట్‌ చర్యను ఎండగట్టారు. దీని వెనుక జట్టు వ్యూహం ఉందని స్మిత్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ ట్యాంపరింగ్ పథకం ప్రకారమే చేశామని పేర్కొన్నాడు. రివర్స్‌ స్వింగ్‌ కోసం ఆసీస్‌ ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌ యత్నించారని, సఫారీ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాలని ఇలా అడ్డదార్లు తొక్కారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ తప్పుచేసినట్లు తేలితే బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ కఠిన చర్యలకు తీసుకునే అవకాశముంది.

Story first published: Sunday, March 25, 2018, 12:20 [IST]
Other articles published on Mar 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X