For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరుగు ఇవ్వని అంపైర్‌.. మైదానంలో రచ్చ చేసిన స్టీవ్‌ స్మిత్‌ (వీడియో)!!

Steve Smith fires on umpire Nigel Llong over dead ball

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మైదానంలో దూకుడు ఎక్కువ. తమ మాటలతో (స్లెడ్జింగ్) ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడంలో ఆసీస్ ఆటగాళ్లు ముందుంటారు. అయితే ఓ అడుగు ముందుకేసి ఆటగాళ్లతోనే కాకుండా ఫీల్డ్ అంపైర్‌లతో గొడవపడుతున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న 'బాక్సింగ్‌ డే' టెస్టులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. విషయంలోకి వెళితే.

స్మిత్‌ ఆడాలనుకోలేదు:

స్మిత్‌ ఆడాలనుకోలేదు:

టాస్‌ ఓడిన ఆసీస్ బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. 61 పరుగులకే డేవిడ్ వార్నర్‌ (41), జో బర్స్న్‌ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. స్టీవ్ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌లు జట్టును ఆదుకున్నారు. అయితే ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ను వేస్తున్న వాగ్నర్‌.. ఓ బంతిని షార్ట్‌ పిచ్‌గా వేసాడు. ఆ బంతిని స్మిత్‌ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ.. ఆ బంతి స్మిత్‌ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు.

స్మిత్‌ రచ్చ:

అయితే స్మిత్ సింగిల్‌ తీసే ప్రయత్నాన్ని ఫీల్డ్ అంపైర్‌ నిగేల్‌ లాంగ్‌ అడ్డుకున్నాడు. దీంతో స్మిత్‌ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. స్మిత్‌ వినిపించుకోకుండా బ్రేక్‌కు వెళ్లిపోయాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాట్స్‌మన్‌ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్‌ అవుతుంది. అంతకుముందు ఓవర్‌లో కూడా ఇలానే జరగడంతో స్మిత్‌ గొడవపడ్డాడు.

 నిషేధం పడినా మారడా:

నిషేధం పడినా మారడా:

ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్మిత్‌పై మండిపడుతున్నారు. 'స్మిత్‌ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడు', 'ఆసీస్‌ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ', 'ఒక్క పరుగు కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌', 'మరోసారి ఏడాది ఇంట్లో కూర్చోవాలనుకుంటున్నాడు', 'నిషేధం పడినా మారడా' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చెత్త నిర్ణయం అంటున్న వార్న్‌:

కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ అంపైర్‌ తీరును తప్పుపట్టాడు. అంపైర్‌ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. 'నాకు తెలిసి అంపైర్‌కు ఐసీసీ నిబంధనల బుక్‌ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్‌ సమయంలో ఎవరైనా ఇవ్వండి' అని విమర్శించాడు. ఆ్రస్టేలియా తొలిరోజు ముగిసేసరికి 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌ (63), స్మిత్ (77*) హాఫ్ సెంచరీలు చేశారు.

Story first published: Thursday, December 26, 2019, 14:20 [IST]
Other articles published on Dec 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+