'స్మిత్... ఆసీస్ విజయానికి మార్గాలను అన్వేషించు'
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టును విజయాల బాట పట్టించడానికి స్మిత్ మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు.
ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని నెలలు ఆసీస్‌కు ఎంతో ముఖ్యమైనవని చెప్పుకొచ్చాడు. 'గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న స్మిత్, కెప్టెన్సీలో మాత్రం సవాల్‌ని ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో జట్టును విజయాల బాట పట్టించడానికి మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఉంది' అని క్లార్క్ సూచించాడు.

తొలి వన్డేలో ఓటమిపై
ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను డ్రా చేసుకోవడం, ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలవ్వడంపై మైకేల్ క్లార్క్ పైవిధంగా స్పందించాడు.

ఆసీస్‌ను విజయాల బాట పట్టించడం స్మిత్ మొదటి బాధ్యత
'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆసీస్‌ను విజయాల బాట పట్టించడం స్మిత్ మొదటి బాధ్యత. జట్టులో ఆత్మవిశ్వాసం రావాలంటే గెలుపుకు మార్గాలు వెతకాలి. నా దృష్టిలో కోహ్లి(భారత కెప్టెన్), స్టీవ్ స్మిత్‌లే ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు. కాకపోతే ఆసీస్ విజయాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆసీస్‌ను విజయాలవైపు నడిపించడమే స్మిత్ ముందున్న సవాల్' అని క్లార్క్ పేర్కొన్నాడు.

కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'కుల్దీప్ ఎటాకింగ్ బౌలర్. తన చేతితో బంతిని నియంత్రిస్తూ మణికట్టు స్పిన్నర్‌గా అద్భుతం. సుదీర్ఘ స్పెల్స్ వేయడంతో పాటు అతడు స్పిన్‌లో అన్ని నైపుణ్యాలను కలిగి ఉన్నాడు. టెస్టు సిరిస్‌లో మంచి ప్రదర్శన చేశాడు' అని క్లార్క్ పేర్కొన్నాడు.

ఈడెన్ గెలిస్తే 3-2తో ఆసీస్ సిరిస్ గెలుచుకుంటుంది
గురువారం ఈడెన్ గార్డెన్‌లో జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే కనుక 3-2తో సిరీస్‌ను గెలుచుకోవడం ఖాయమని క్లార్క్ జోస్యం చెప్పాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోతే ఏమి జరుగుతుందనే దానిపై అంచనా వేయలేనని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications