
హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరుస రికార్డులతో మెల్‌బోర్న్ చెలరేగిపోతున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఐదో రోజు టెస్ట్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో అతి తక్కువ సమయంలో 23సెంచరీలు చేసిన వాడిగా నాలుగో రోజు రికార్డుకెక్కాడు.
ఇదే కాక, మూడు సంవత్సరాల సమయంలో డాన్ బ్రాడ్‌మన్ నాలుగు సెంచరీలు చేశాడు. అదే రీతిలో స్టీవ్ స్మిత్ సైతం మూడేళ్లలో నాలుగు సెంచరీలు చేసి బ్రాడ్‌మన్ నారికార్డును సమం చేశాడు.
డాన్ బ్రాడ్‌మన్: 112, 123, 152 & 167 (From 1928-31)
స్టీవ్ స్మిత్: 192, 134*, 165* & 102* (From 2014-17)
28ఏళ్ల స్మిత్ తన కెరీర్‌లో 23వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్‌లో అతి తక్కువ సమయంలో 23వ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారులలో బ్రాడ్‌మన్(59), సునీల్ గవాస్కర్(109)ఉండగా స్మిత్ వీరి తర్వాతి స్థానంలో చేరాడు.
ఇదే కోవలో పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్(122), టెండూల్కర్ (123)ఉండగా స్మిత్ 110 కే వీళ్లిద్దరినీ దాటేశాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నాడు. పెర్త్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ 239 పరుగులు చేసిన సంగతి విదితమే.
అతి తక్కువ సమయంలో 23 సెంచరీలు చేసిన వారి జాబితా:
59 - Sir Don Bradman
109 - Sunil Gavaskar
110 - Steve Smith
122 - Mohammad Yousuf
123 - Sachin Tendulkar
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.