Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ 20 లీగ్ సంపాదనంతా దానం చేయనున్న స్టీవ్ స్మిత్

 Steve Smith to donate his Global T20 League earnings

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ త్వరలోనే మైదానంలోకి పునరాగమనం చేయనున్నారు. లీగ్‌ను 12 నెలల పాటు నిషేదాన్ని ఎదుర్కొంటున్న స్మిత్.. వచ్చే నెలలో కెనడాలో జరిగే గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొననున్నారు. ఇంతే కాదు, దీంతో పాటు ఆయన అభిమానులకు మరో గర్వించదగ్గ విషయం చెప్పారు. ఈ టోర్నీలో ఆడటం ద్వారా వచ్చిన సొమ్మంతా కెనడా, ఆస్ట్రేలియా‌లలో క్రికెట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు డొనేట్ చేయనున్నాడు.

స్మిత్.. కెనడాలో జరగనున్న ఈ కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేగాక, కెనడా దేశంలోని క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించేలా ప్రచారంలో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి వచ్చే సంపాదనను విరాళంగా ప్రకటించాడు. ఈ టోర్నీలో స్మిత్.. క్రిస్ గేల్, షాహిది అఫ్రీది, లసిత్ మలింగ, సునీల్ నరైన్, డేన్ బ్రావో వంటి ప్రముఖులతో పాటుగా ఆడనున్నాడు. మొత్తం ఈ టోర్నీలో 6 జట్లు వరకూ తలపడనున్నాయి. ఎడ్మంటన్ రాయల్స్, మోంట్రీల్ టైగర్స్, టొరెండో నేషనల్స్, వాంకొవర్ నైట్స్, విన్నీపెగ్ హాక్స్ జట్లు.

మ్యాచ్‌లు అన్ని టోరంటోలోని మాపిల్‌ లీఫ్‌ క్రికెట్‌ క్లబ్‌ వేదికగా జరుగుతాయి. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న వార్నర్, బాన్ క్రాఫ్ట్, స్మిత్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల పాటు నిషేధం విధించింది. సరిగ్గా ఐపీఎల్ ఆరంభానికి ముందు ఇలా జరగడంతో.. బీసీసీఐ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు స్మిత్‌ను అనుమతించలేదు. నిషేధం ప్రకారం స్మిత్‌ జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు నిర్దేశించిన కాలం పాటు దూరంగా ఉండాలి.

ఈ నేపథ్యంలో స్మిత్, వార్నర్‌లు మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ అంతర్జాతీయ క్రికెట్ లో పాల్గొనకూడదు. అయితే, ఇతర దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో ఆయా బోర్డుల అనుమతితో పాల్గొనవచ్చు. ఈ క్రమంలో గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొనడానికి స్మిత్‌కు పిలుపు వచ్చింది. ఇదే లీగ్‌లో క్రిస్‌ లిన్‌, క్రిస్‌ గేల్‌, షాహిద్‌ అఫ్రిది తదితర క్రీడాకారులు సైతం పాల్గొననున్నారు.

Story first published: Friday, June 1, 2018, 16:04 [IST]
Other articles published on Jun 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+