Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కోసం స్మిత్, వార్నర్‌లతో ప్రాక్టీస్

Steve Smith,David Warner Come To The Aid Of Australian Bowlers To Combat Virat Kohli Threat
Steve Smith, David Warner Come To The Aid Of Australian Bowlers To Combat Virat Kohli Threat

ముంబై: ఆస్ట్రేలియా పర్యటన మొదలవకముందే ఆసీస్ జట్టు పన్నిన వ్యూహం ఒకటే. పరుగుల యంత్రం విరాట్‌ని అవుట్ చేసి పరుగులను కట్టడి చేయాలి. ఈ క్రమంలో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టెస్టుల్లో నిలువరించేందుకు విభిన్న వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా కోహ్లీని తక్కువ పరుగులకే పెవిలియన్‌ పంపించాలని ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఇందుకోసం మాజీ లేదా నిపుణులైన బౌలర్ల సహాయం తీసుకుంటారు.

మైదానంలో మెరిసిన స్మిత్.. వార్నర్

మైదానంలో మెరిసిన స్మిత్.. వార్నర్

ఆతిథ్య జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పర్యాటక జట్టు కోసం భిన్నమైన వ్యూహాన్ని ఆలోచించాడు. ఏడాది నిషేధానికి గురైన టాప్‌ ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లను రంగంలోకి దింపాడు. సిడ్నీలో జరిగిన టీ20 ముందు డేవిడ్‌ వార్నర్‌ అదే మైదానంలో ఆస్ట్రేలియా శిబిరంలో కనిపించాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్లబ్‌ క్రికెట్‌ ఆడుతున్న అతడు ఆసీస్‌ శిబిరంలో కనిపించడంపైన అందరికీ సందేహం కలిగింది.

సుదీర్ఘ ఫార్మాట్‌లో అడ్డుకోవడం చాలా కష్టం

సుదీర్ఘ ఫార్మాట్‌లో అడ్డుకోవడం చాలా కష్టం

ఇలా ప్రాక్టీస్ చేయడం కూడా వ్యూహంలో ఓ భాగమే. కంగారూ జట్టులో ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌‌లుగా ఉన్నది మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌లు మాత్రమే. చక్కటి ఫామ్‌తో పాటు అధిక పరుగులు సాధిస్తూ.. ఆ జట్టు సాధించిన పరుగుల్లో అగ్రభాగాన్ని దక్కించుకున్నారు. చాలా ఓపికగా, మంచి టెక్నిక్‌తో, భీకర ఫామ్‌లో క్రికెట్‌ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌‌ని సుదీర్ఘ ఫార్మాట్‌లో అడ్డుకోవడం చాలా కష్టం. అందులోనూ గత పర్యటనలో అతడు 4 టెస్టుల్లో 86.50 సగటుతో 694 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు.

బౌలింగ్‌లో నాణ్యత మెరుగవుతుందని

బౌలింగ్‌లో నాణ్యత మెరుగవుతుందని

ఇలాంటి ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవాలంటే ప్రత్యర్థి బౌలర్లు చాలా కష్టపడాలి. టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌కు బంతులు వేస్తేనే ఆ స్థాయి పోటీ తెలుస్తుంది. అవగాహన ఉంటుంది. అందుకని స్మిత్‌, వార్నర్‌కు టెస్టు బౌలర్లతో బంతులు వేయించారు. దీంతో వారి బౌలింగ్‌లో నాణ్యత మెరుగవుతుంది. అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఇతర బౌలర్లకు సూచనలు ఇచ్చేందుకు మిచెల్‌ స్టార్క్ సాయమూ తీసుకుంటున్నారు.

కోహ్లీ చెలరేగడంతో పుంజుకోలేకపోయాం

కోహ్లీ చెలరేగడంతో పుంజుకోలేకపోయాం

'చివరి టీ20లో కోహ్లీ అత్యుత్తమంగా ఆడాడు. అతడిపై కాస్త ఒత్తిడి చేశాం. ఓపెనర్లు పవర్‌ప్లేలో చెలరేగడంతో మేం పుంజుకోలేకపోయాం. విరాట్‌ ఇలా ఆడటం మేం ఇంతకు ముందూ చూశాం. బహుశా టెస్టుల్లో పరిస్థితి వేరేలా ఉండొచ్చు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆసీస్‌కు మంచి పేసర్లు, స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ ఉన్నారు. మంచి నాణ్యమైన పోటీ క్రికెట్‌ను చూడబోతున్నాం' అని అలెక్స్‌ కారె పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 27, 2018, 13:30 [IST]
Other articles published on Nov 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+