Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: కోహ్లీకి చేరువగా స్మిత్

Steve Smith Closes in as Virat Kohli Maintains Top Spot in ICC Test Rankings

'హైదరాబాద్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, యాషెస్ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన టెస్టు ర్యాంకుని మరింత మెరుగుపరుచుకున్నాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్మిత్‌ రెండో స్థానానికి ఎగబాకాడు.

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు సెంచరీలు

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు సెంచరీలు

యాషెస్‌ సిరిస్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు సెంచరీలు సాధించిన స్మిత్... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. ఫలితంగా తన టెస్టు ర్యాంకింగ్‌లో పైకి ఎగబాకాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్‌ 913 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 922 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

వీరిద్దరి మధ్య కేవలం తొమ్మిది పాయింట్లే

వీరిద్దరి మధ్య కేవలం తొమ్మిది పాయింట్లే

వీరిద్దరి మధ్య కేవలం తొమ్మిది పాయింట్లు మాత్రమే వ్యత్యాసం​ ఉంది. యాషెస్‌లో ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండటంతో స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక, నాలుగో స్థానంలో ఇండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా(881 పాయింట్లు) ఉండగా, శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

దినేష్ కార్తీక్ అభిమాన కబడ్డీ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఆగస్టు 22 నుంచి వెస్టిండిస్‌తో తొలి టెస్టు

ఆగస్టు 22 నుంచి వెస్టిండిస్‌తో తొలి టెస్టు

మరోవైపు ఆగస్టు 22 నుంచి టీమిండియా సైతం వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ రాణించిన తీరుపైనే అతడి అగ్రస్థానం ఆధారపడి ఉంటుంది. చివరగా ఈ ఏడాది మొదట్లో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న క్రమంలో కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

తొలిస్థానంలో ప్యాట్ కమిన్స్

తొలిస్థానంలో ప్యాట్ కమిన్స్

ఇక, బౌలర్ల విషయానికొస్తే యాషెస్ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ప్యాట్ కమిన్స్ తొలిస్థానంలో నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. రవిచంద్రన్ అశ్విన్ మాత్రంలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌ రౌండర్ల జాబితాలో జడేజా మూడో స్థానంలో ఉండగా, హోల్డర్, షకిబ్ ఉల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Story first published: Monday, August 19, 2019, 17:53 [IST]
Other articles published on Aug 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+