కోహ్లీ ఆరోపణలు ఓ చెత్త: 'ది జర్నీ' పుస్తకంలో స్మిత్
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్‌ఎస్ సమీక్ష కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి వివాదాల్లో నిలిచిన సంగతి అభిమానులు ఎవరూ మరచిపోలేరు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించడంతో రివ్యూ కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరుల సహాయం కోరే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోని ఫీల్డ్ అంఫైర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేయడం ఆ సిరీస్ మొత్తంలో ఇదే అతి పెద్ద వివాదంగా నిలిచింది. ఈ సంఘటనపై ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో 'స్మిత్ ఓ మోసగాడు' అని, ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇలాగే చేశాడని, దాంతో తాను అంపైర్లకు ఫిర్యాదు కూడా చేశానని చెప్పాడు.
అటు బీసీసీఐ కూడా డీఆర్‌ఎస్‌కు కొత్త భాష్యం చెబుతూ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఐసీసీ ఎవరిపైనా చర్య తీసుకోకుండా వదిలేసింది. అయితే ఇప్పుడు ఈ ఘటనపై మళ్లీ స్టీవ్ స్మిత్ పెదవి విప్పాడు. తన పుస్తకం 'ది జర్నీ'లో దీని గురించి రాస్తూ కోహ్లి చేసిన ఆరోపణలను 'చెత్త'గా అభివర్ణించాడు.

ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ తీసేందుకే
ఇదంతా ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ తీసేందుకు భారత్ పన్నిన వ్యూహంలో భాగమని స్మిత్ చెప్పుకొచ్చాడు. 'ఈ అంశం ఇంత పెద్ద వివాదంగా ఎందుకు మారిందో నాకు అప్పటికి గానీ అర్థం కాలేదు. నాకు తెలిసి నేను అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎలాంటి సూచనలు తీసుకోలేదు' అని స్మిత్ అన్నాడు.

అంపైర్ల దృష్టికి తీసుకువచ్చానని కోహ్లీ చెప్పాడు
'అలాగే కొన్నిసార్లు ఇదే విషయమై అంపైర్ల దృష్టికి తీసుకువచ్చానని కోహ్లీ చెప్పాడు. అయితే మ్యాచ్ అంపైర్లు గానీ రిఫరీ క్రిస్ బ్రాడ్ గానీ ఈ విషయమై నన్ను కనీసం సంప్రదించలేదు. సిరీస్‌లో వేడి పెంచేందుకు కోహ్లీ తనదైన శైలిలో చేసిన పని అది. అసలు కోహ్లీ సరిగ్గా ఏ విషయం గురించి ఆ ఆరోపణలు చేశాడో కూడా నాకు తెలీదు' అని స్మిత్ తన పుస్తకంలో రాశాడు.

కోహ్లీ వ్యవహార శైలి ఆశ్చర్యపరిచింది
మరో వైపు ఆ టెస్టు సిరీస్ అనంతరం జరిగిన ఐపీఎల్‌లో కోహ్లీ వ్యవహార శైలి ఆశ్చర్యపరిచిందని స్మిత్ చెప్పాడు. తాము కలిసినప్పుడు కోహ్లీ స్నేహపూర్వకంగానే ఉన్నాడని, తన దృష్టిలో అదంతా ఒక మిస్టరీగా మిగిలి పోయిందని తన మనసులో మాటను ఈ పుస్తకంలో రాశాడు.

బీసీసీఐ అలా చేయడం సరైన చర్య కాదు
అలాగే ఆ ఘటనకు సంబంధించి స్టంప్ మైక్రోఫోన్ ఆడియోను బీసీసీఐ విడుదల చేయడం సరైన చర్య కాదని కూడా స్మిత్ అభివర్ణించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి ‘డెడ్'గా మారిపోయిన తర్వాత స్టంప్ మైక్రోఫోన్‌లలో వినిపించే సంభాషణలను బయట పెట్టరాదని, బీసీసీఐ తమకు కావాల్సిన విధంగా వాటిని బయటపెట్టి ఆసీస్‌ను తప్పు పట్టే ప్రయత్నం చేసిందని స్మిత్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications