
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో రోజు ఇంగ్లాండ్ జట్టుతో ఆస్ట్రేలియా జట్టు తలపడుతుంది. ఈ నేపథ్యంలో నాన్‌స్టాప్‌గా పరుగులు తీస్తూ శనివారం మధ్యాహ్నం వరకు క్రీజులోనే ఉన్న రికార్డుల వరద పారిస్తున్నాడు.
ఐదో రోజు జరిగిన మ్యాచ్‌లో 102స్కోరును నమోదు చేశాడు. ఇప్పటికే ఓటమి ఖరారైపోయినప్పటికీ ఇంకా ఇంగ్లాండ్ గట్టిపోటీనే ఇస్తుంది. నాలుగో టెస్టులో భాగంగా ఆఖరి రోజైన ఐదో రోజు శనివారం నాటికి ఆస్ట్రేలియా మంచి స్కోరుతోనే ఉంది.
28ఏళ్ల స్మిత్ తన కెరీర్‌లో 23వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్‌లో అతి తక్కువ సమయంలో 23వ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారులలో బ్రాడ్‌మన్(59), సునీల్ గవాస్కర్(109)ఉండగా స్మిత్ వీరి తర్వాతి స్థానంలో చేరాడు.
ఇదే కోవలో పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్(122), టెండూల్కర్ (123)ఉండగా స్మిత్ 110 కే వీళ్లిద్దరినీ దాటేశాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నాడు. పెర్త్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ 239 పరుగులు చేసిన సంగతి విదితమే.
అతి తక్కువ సమయంలో 23 సెంచరీలు చేసిన వారి జాబితా:
59 - Sir Don Bradman
109 - Sunil Gavaskar
110 - Steve Smith
122 - Mohammad Yousuf
123 - Sachin Tendulkar
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.