
కెప్టెన్‌గా స్టీవ్
'ది హండ్రెడ్' లీగ్‌కు ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. ఇక 8 జట్ల ఫ్రాంఛైజీలు తమ జట్లకు కెప్టెన్లను నియమించే పనిలో ఉన్నాయి. తాజాగా వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ తమ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకొని ఏడాది నిషేధం ఎదుర్కోన్న స్మిత్‌కు కెప్టెన్సీ ఇదే తొలిసారి. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా 2018లో ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తప్పించారు. పునరాగమనం చేసినా.. అతనికి మళ్లీ ఆ అవకాశం రాలేదు.

గౌరవంగా భావిస్తున్నా
తొలి సీజన్‌లో వెల్ష్ టీమ్‌కు తనను కెప్టెన్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు స్మిత్ పేర్కొన్నారు. 'తొలి సీజన్‌లో వెల్ష్ టీమ్ నన్ను కెప్టెన్‌గా నియమించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించిన గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మా టీం చాలా బలంగా ఉంది. టామ్ బాంటన్ ప్రస్తుతం ప్రపంచంలోని యువ ఆటగాళ్ళలో ఒకడు. మిచెల్ స్టార్క్ ఎక్కడైనా బంతితో రాణించగలడు. కార్డిఫ్ అభిమానుల కోసం అద్భుత ప్రదర్శన చేయాలనుకుంటున్నాం' అని స్మిత్ చెప్పుకొచ్చారు.

వార్నర్, గేల్ కూడా
మైదానంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్మిత్ అనుభవం మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్ష్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. వెల్ష్ ఫైర్ జట్టులో జానీ బెయిర్‌స్టో, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, టామ్ బాంటన్, లియామ్ ఫ్లంకెట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్ కూడా లీగ్‌లో ఆడనున్నారు.

ఒక ఇన్నింగ్స్‌కు 100 బంతులు
జులై 17 నుంచి 'ది హండ్రెడ్ టోర్నీ' ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. లండన్ నుంచి రెండు జట్లు, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, లీడ్స్, నాటింగ్‌హామ్, కార్డిఫ్, సౌతాంప్టన్‌లు జట్లు. ఒక ఇన్నింగ్స్‌కు 100 బంతులు మాత్రమే ఉంటాయి. ఒక్కో బౌలర్ గరిష్టంగా 20 బంతులు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లో మొదటి 25 బంతుల వరకు పవర్ ప్లే ఉంటుంది.


Click it and Unblock the Notifications
