Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2024 టాప్-4 జట్లు ఇవే: లిస్ట్‌లో సర్‌ప్రైజ్ టీమ్: లెజెండరీల జోస్యం

IPL 2024 top 4 teams: మచ్ అవైటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఈ రాత్రికే ఆరంభం కాబోతోంది. 8 గంటలకు తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై చెపాక్‌‌ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

Steve Smith and Dale Steyn prediction on top 4 teams of IPL 2024

ఐపీఎల్‌తో పాటే దానిపై అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఏ జట్టు గెలుస్తుంది?, ఏ టీమ్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది?, అత్యధిక పాయింట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి?, ఏ జట్టు నాసిరకంగా ఆడుతుంది.. అట్టడుగు స్థాయికి పడిపోతుంది?.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై క్రికెటర్ లెజెండర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు.

ఈ ప్రశ్నలన్నింటికీ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సమాధానాలను ఇచ్చాడు. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ టాప్‌లో నిలుస్తుందని చెప్పాడు. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీ ఆ జట్టును విజయాలను అందిస్తుందని పేర్కొన్నాడు. కేప్టెన్సీ ఒత్తిడి లేకపోవడం వల్ల రోహిత్ శర్మ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడని, భారీగా పరుగులు రాబడతాడని స్పష్టం చేశాడు.

Steve Smith and Dale Steyn prediction on top 4 teams of IPL 2024

ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశాలు ఉన్నాయని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్లతో నిండి ఉందని, బ్యాటింగ్, బౌలింగ్‌ ఆర్డర్ బ్యాలెన్స్డ్‌గా ఉందని చెప్పాడు. రిషభ్ పంత్ జట్టుకు అందుబాటులోకి రావడం ఢిల్లీ కేపిటల్స్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్.. ఇంచుమించుగా ఇలాంటి అంచనాలనే వెలిబుచ్చాడు. తన ఓటు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలుస్తుందని చెప్పాడు. ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్.. జట్టును ఛాంపియన్‌గా నిలపగలడనీ పేర్కొన్నాడు. మిగిలిన రెండు స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నిలుస్తాయని చెప్పాడు.

Story first published: Friday, March 22, 2024, 11:38 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+