పాక్‌లో ఆడేందుకు నిరాకరించిన డివిలియర్స్, స్మిత్

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేదం అనుభవిస్తున్న స్టీవ్ స్మిత్ దేశీవాలీ లీగ్‌లలో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్మిత్‌తో పాటుగా ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన డివిలియర్స్ కూడా ఇదే లీగ్‌లో ఆడేందుకు సిద్ధమైయ్యాడు.

పాకిస్థాన్‌కి రాలేమని స్మిత్, డివిలియర్స్
ఇదిలా ఉంటే లీగ్ వేదికను పాకిస్తాన్‌కు తరలించేందుకు పీఎస్ఎల్ నిర్వహక సంఘం నిర్ణయించింది. ఆ విషయం నచ్చకపోవడంతో డివిలియర్స్, స్మిత్ పాకిస్తాన్‌లో ఆడేందుకు నిరాకరించారు. తాము యూఏఈ గడ్డపై జరిగే మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడతామని తెగేసి చెప్పేశారు. భద్రతా కారణాలతో తాము పాకిస్థాన్‌కి రాలేమని స్మిత్, డివిలియర్స్‌తో పాటు కొంత మంది విదేశీ క్రికెటర్లు ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్‌పై అనుమానంతో విముఖత
భద్రతా విషయాల పట్ల పాకిస్తాన్‌పై అనుమానంతో వారిద్దరూ విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పాక్‌లో ప్లేఆఫ్, ఫైనల్‌తో పాటు మొత్తం ఏడు మ్యాచ్‌లు నిర్వహించాలని ఆశించిన పీసీబీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘంగా సాగనున్న పీఎస్‌ఎల్‌లో 311 మంది పాక్ క్రికెటర్లు పాల్గొంటుండగా.. 371 మంది విదేశీ క్రికెటర్లు కూడా భాగస్వామ్యంకానున్నారు.

పీఎస్ఎల్ ఆదరణ పెరుగుతుందని పాక్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్, బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్‌స్మిత్ ఈ టోర్నీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. పీఎస్ఎల్ ఆదరణ పెరుగుతుందని పాక్ బోర్డు భావించింది. కానీ.. ఇప్పుడు వారు మెలిక పెట్టడంతో.. ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications