Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ క్రికెట్‌కు కోచ్‌గా స్టీవ్ రోడ్స్

Steve Rhodes: Bangladesh name former England wicketkeeper-batsman as coach

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఇంగ్లాండ్‌ మాజీ టెస్టు ఆటగాడు స్టీవ్‌ రోడ్స్‌ ఎంపికయ్యాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన రోడ్స్‌ 90ల్లో 11 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. గత ఏడాది అక్టోబరులో శ్రీలంకకు చెందిన హతురసింఘ పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌ కోచ్‌ పదవి ఖాళీగా ఉంది. జట్టుకు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ కోట్నీ వాల్ష్‌.. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ప్రధాన కోచ్‌ పదవిని భర్తీ చేసే బాధ్యతను బంగ్లాదేశ్‌ బోర్డు టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌కు అప్పగించడం విశేషం. నెల రోజుల కసరత్తు అనంతరం బోర్డు, ఆటగాళ్లతో సంప్రదించి స్టీవ్‌ రాడ్స్‌ను కిర్‌స్టన్‌ కోచ్‌గా ఎంపిక చేశారు. 53 సంవత్సరాల స్టీవ్ రోడ్స్ ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. 11 టెస్టులు, తొమ్మిది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

ప్రస్తుతం కోచ్‌గా బంగ్లాదేశ్‌కు 2 సంవత్సరాల (2020 వరల్డ్ టీ20) వరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా శ్రీలంక ఛండిక హతురుసింఘ స్థానాన్ని భర్తీ చేసేందుకు పూనుకున్నాడు. ఈ సందర్భంగా రోడ్స్ మాట్లాడుతూ.. 'ఈ పదవి దక్కించుకోవడం గౌరవదాయకంగా ఉంది.' అంటూ హర్షం వ్యక్తం చేశాడు. స్టీవ్ రోడ్స్ ఆటతీరుకు గానూ అతణ్ని ఇంగ్లాండ్ స్కౌట్‌గా మే నెలలో ఎడ్ స్మిత్ నియమించారు.

కానీ, మరి కొద్దిరోజుల్లో అఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌కు వెస్డిండీస్ గ్రేట్ కోర్ట్నీ వాష్ బాధ్యతలు వహించనున్నాడు.

Story first published: Friday, June 8, 2018, 10:15 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+