Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత పర్యటనకు ముందే ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ

హైదరాబాద్: త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడైన జోష్ హాజల్‌‌ఉడ్ గాయం కారణంగా భారత పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో మూడో రోజు మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా బౌలింగ్‌ వేయడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. దీంతో బౌలింగ్‌ చేస్తున్న సమయంలోనే హాజల్‌ఉడ్ కెప్టెన్ స్మిత్‌తో మాట్లాడి మైదానం నుంచి వెళ్లిపోయాడు.

అనంతరం హాజల్‌ఉడ్‌ని పరీక్షించిన వైద్యులు అతడికి విశ్రాంతి తీసుకోమని సూచించడంతో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు భారత పర్యటనకు హాజిల్‌వుడ్‌ దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టులో అతడి స్ధానాన్ని ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఓకీఫ్ భర్తీ చేస్తాడని బోర్డు తెలిపింది.

ఇక, భారత పర్యటనలో హాజల్‌ఉడ్ స్ధానాన్ని ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌ భర్తీ చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా, ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ ఉల్ హ‌స‌న్ ఈ మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసి బంగ్లాదేశ్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ష‌కీబ్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 పరుగులు చేయ‌గా ఆస్ట్రేలియా 217 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 221 పరుగులు చేయడంతో ఆసీస్‌కు 265 పరుగులు విజయ లక్ష్యంగా నిర్దేశించింది.

రెండో ఇన్నింగ్స్‌లో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 244 పరుగులకే ఆలౌటైంది. 109/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెన‌ర్ వార్న‌ర్ (112) మెరుపు సెంచ‌రీ చేసినా మిగ‌తా బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మయ్యారు.

చివ‌రి 7 వికెట్ల‌ను కేవ‌లం 73 ప‌రుగుల తేడాలో కోల్పోయింది. ఓవ‌ర్‌నైట్ స్కోరు 2 వికెట్ల‌కు 109 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో గెలిచేలా క‌నిపించినప్పటికీ చివ‌రికి ఓట‌మి త‌ప్ప‌లేదు. 101 టెస్టులు ఆడిన బంగ్లాకు ఇది పదో విజయం కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే సెప్టెంబరు 17 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా ఆతిథ్య భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. భారత పర్యటన అనంతరం బ్రిస్బేన్ వేదికగా నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+