For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు'

Steve and me are good mates - Warner

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురి కావల్సి వచ్చింది. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడడంతో క్రికెట్‌లో కొద్ది నెలల పాటు.. ఈ విషయంపై చర్చలు నడిచాయి. అయితే, ఈ వివాదానికి డేవిడ్‌ వార‍్నరే ప్రధాన కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనికి స‍్టీవ్‌ స్మిత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయట.

దీనిపై వార‍్నర్‌ స్పందిస్తూ... ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య ఏ విధమైన విభేదాలు చోటు చేసుకోలేదన్నాడు. ఒకవేళ తమ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయనడంలో నిజం ఉంటే అది ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా.?అని ప్రశ్నించాడు.

ఒకవైపు గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఆకట్టుకుంటే, వార్నర్‌ మాత్రం విఫలం చెందాడు. విన్నీపెగ్‌ తరపున బరిలోకి దిగిన వార్నర్‌ పరుగు మాత్రమే చేశాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న వార్నర్‌..లసిత్‌ మలింగాలో బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

ఈ లీగ్‌లో స్టీవ్ స్మిత్ టోరంటో నేషనల్స్‌ జట్టు తరుపున ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం టొరొంటో నేషనల్స్‌-వాంకోవర్‌ నైట్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాంకోవర్‌ నైట్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టొరొంటో నేషనల్స్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవ్ స్మిత్‌ 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 61 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Saturday, June 30, 2018, 17:06 [IST]
Other articles published on Jun 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+