Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ విషయంలో తప్పు జరిగిందని 22 ఏళ్ళ తర్వాత చెబితే ఎలా సార్..!

ఆస్ట్రేలియాతో 2003-04లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ ఔటైన క్షణం ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోరు. వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ ఇచ్చిన ఆ LBW కేవలం మ్యాచ్‌పైనే కాకుండా,మొత్తం క్రికెటింగ్ ప్రపంచాన్ని కుదిపేసింది.ఇది ఒకే సంఘటన కాదు,టెండూల్కర్‌తో సంబంధం ఉన్న అనేక తప్పుల నిర్ణయాలకు బక్నర్ కారణమయ్యారు.

22 ఏళ్లు తర్వాత, 79 ఏళ్ల మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్ బ్రిస్బేన్ ఔట్‌పై మౌనం వీడారు.జేసన్ గిలెస్పీ వేసిన బంతిని సచిన్ వదిలేయగా అది అతని ప్యాడ్‌కు తగిలింది.ఆస్ట్రేలియన్లు గట్టిగా అప్పీల్ చేశారు, బక్నర్ చూపుడు వేలు అమాంతం పైకి లేచింది. దీంతో సచిన్ తీవ్ర నిరాశకు గురై పెవీలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అయితే తాను చేసింది తప్పే అని బక్నర్ ఒప్పుకున్నారు. అప్పుడు తాను చేసిన పొరపాటుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు బక్నర్ తెలిపారు. వాస్తవానికి స్టీవ్ బక్నర్‌కు అంపైరింగ్ పరంగా మంచి పేరు ఉంది. తను అంత సులువుగా పొరపాటు చేసే వ్యక్తి కాదు. కానీ తను కూడా మానవుడే కదా. సచిన్ విషయంలో ఆ పొరపాటు దొర్లింది.

Steve Bucknor Admits His Mistake After 22 Years On Controversial Sachin Tendulkar LBW

ఆ డెలివరీలో ఏం జరిగింది?

"నేను సచిన్ టెండూల్కర్‌ను LBWగా ఔటిచ్చానన్న విషయం తప్పని తెలుసు. కానీ ఈ రోజు వరకు క్రికెట్ ఫ్యాన్స్ దాని గురించే మాట్లాడుకుంటారు. నేను ఎందుకు ఔటిచ్చాను? అది ఔటేనా? అని అడుగుతుంటారు.అయితే జీవితంలో తప్పులు జరుగుతాయి. నాది తప్పే"అని అంగీకరించారు బక్నర్.

టెండూల్కర్, టీవీల్లో చూస్తున్న లక్షలాది మంది క్రికెట్ అభిమానులు బ్రిస్బేన్‌లో జరిగిన ఈ సంఘటన చూసి నిశ్శబ్ధంగా ఉండిపోయారు.అప్పటి దిగ్గజ కామెంటేటర్ టోనీ గ్రెగ్ దీనిని భయంకరమైన నిర్ణయంగా అభివర్ణించారు. బౌన్స్, కదలికను గమనించండి. బక్నర్‌ చేసిన ఆ చారిత్రాత్మక తప్పు పై తన అభిప్రాయం గురించి చెప్పాల్సిందిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను అడగ్గా.."నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆయన తన వేలు ఎత్తకుండా బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని ఉండాల్సింది" అని ఈ క్రికెట్ గాడ్ చమత్కారంతో బదులిచ్చారు.

Story first published: Tuesday, February 24, 2026, 18:30 [IST]
Other articles published on Feb 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+