న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Stephen Fleming: టీకప్పులో తుఫాన్ వచ్చినట్లు అదంతా పెద్ద ముచ్చటేం కాదు

Stephen Fleming says Ambati Rayudus retirement announcement is not a big deal

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు తను ఐపీఎల్‌‌కు రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తున్నట్లు ట్విట్టరులో పోస్టు చేయడం సంచలనమైంది. ఆ ట్వీట్‌ను గంట తర్వాత రాయుడు తొలగించాడు. ఇక ఆ ట్వీట్‌ సోషల్ మీడియాలో సంచలనమైంది. ట్వీట్లో అంబటి రాయుడు ఇదే తన చివరి ఐపీఎల్ అని ట్వీట్ చేశాడు. అయితే ఒక గంట తర్వాత ట్వీట్‌ను తొలగించి మరో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఈ ఎపిసోడ్‌పై మాజీ న్యూజిలాండ్ కెప్టెన్, ప్రస్తుత సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. అది టీకప్‌లో తుఫాను లాంటి యవ్వారం అని పేర్కొన్నాడు.

' అంబటి రాయుడు ప్రకటన పెద్దగా నిరుత్సాహపరిచేదేం కాదు. నిజం చెప్పాలంటే టీకప్‌లో కొంచెం తుఫాను వచ్చినట్లు అదంతా ఉత్త ముచ్చట. అతను బాగానే ఉన్నాడు. మా ఫ్రాంచైజీలో ఆ వ్యవహారం వల్ల పెద్దగా ఏం హడావుడి జరగలేదు. ఇదసలు మ్యాటరే కాదు.' అని ఫ్లెమింగ్ తెలిపాడు. ఆదివారం జరిగిన సీఎస్కె వర్సెస్ జీటీ మ్యాచ్ తర్వాత వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు.

Stephen Fleming says Ambati Rayudus retirement announcement is not a big deal


ఇక రాయుడు ఎలా ట్వీట్ చేశాడంటే.. 'ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను 13సంవత్సరాలుగా ముంబై, చెన్నై లాంటి గొప్ప జట్ల తరఫున ఆడడాన్ని ఆస్వాదించాడు. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన ముంబై ఇండియన్స్‌కు, సీఎస్కేకే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని రాయుడు పేర్కొని కాసేపయ్యాక ట్వీట్ తొలగించాడు. ఇక ఈ ట్వీట్ సంచలన కావడంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఈ వ్యవహారంపై స్పందించాడు. అబ్బే రాయుడు రిటైరవ్వట్లేదు, రాబోయే సీజన్‌లో కూడా సీఎస్కే తరఫున ఆడతాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో విభేదాల తర్వాత 2019లో తాను అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అవుతున్నానని అప్పట్లో ప్రకటించాడు. అయితే HCA అధికారులతో పలు సమావేశాల తర్వాత దానిని వెనక్కి తీసుకున్నానని రాయుడు తెలిపాడు.
Story first published: Monday, May 16, 2022, 16:35 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X