న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డేలో విరాట్ కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే

Stats: Virat Kohli smashes numerous records in the second ODI against WI
India vs Westindies 2018 2nd Odi : Virat Kohli's Recods In Vizag Stadium

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరుపురానిదిగా మిగిలింది. ఇప్పటివరకు ఈ మైదానంలో ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65 పరుగులు చేసిన కోహ్లీ... తాజాగా (157 నాటౌట్‌) మరో సెంచరీ సాధించాడు.

విశాఖలో 2nd ODI: వన్డేల్లో 37వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీవిశాఖలో 2nd ODI: వన్డేల్లో 37వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ

తనకు అచ్చొచ్చిన ఈ మైదానంలోనే తన క్రికెట్ కెరీర్‌లోనే చిర్మస్మరణీయమైన పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

విశాఖ వన్డేలో సెంచరీ సాధించడంతో కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే:

 ఐదో భారత బ్యాట్స్‌మన్‌

ఐదో భారత బ్యాట్స్‌మన్‌

వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. విశాఖ వన్డేలో కోహ్లీ 37వ సెంచరీని సాధించాడు. 107 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 102 పరుగుతో సెంచరీని సాధించాడు.

వన్డేల్లో 37వ సెంచరీ

వన్డేల్లో 37వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇది రెండోది కావడం గమనార్హం. విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో విండీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ(6) రికార్డు సృష్టించాడు. గిబ్స్‌, ఆమ్లా, డివిలియర్స్‌ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.

అత్యంత వేగంగా 4000 పరుగులు

అత్యంత వేగంగా 4000 పరుగులు

1 - సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన క్రికెటర్. ఈ మైలురాయిని అందుకోవడానికి కోహ్లీకి 78 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, అంతక ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ (91 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

1 - వెస్టిండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్

విరాట్ కోహ్లీ: 29 ఇన్నింగ్స్‌ల్లో 1574*

సచిన్ టెండూల్కర్: 39 ఇన్నింగ్స్‌ల్లో 1573

రాహుల్ ద్రవిడ్: 1348 పరుగులు

సౌరవ్ గంగూలీ: 1142 పరుగులు

కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు

కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు

1 - వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. 9000 పరుగుల నుంచి పది వేల పరుగుల మైలురాయిని కోహ్లీ కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.

1 - వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్నవయస్కుడిగా విరాట్ కోహ్లీ(10 ఏళ్ల 68 రోజులు) నిలిచాడు. అంతకముందు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ (10 ఏళ్ల 317 రోజులు) పేరిట ఉంది.

1 - వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న బంతులు 10813.

వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

1 - వెస్టిండిస్, శ్రీలంక జట్లపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

1 - అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు కోహ్లీ 137 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

1 - ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాప్రికా ఆటగాడు హషీం ఆమ్లా(2010లో 15 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు) రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

టీమిండియాకు 950వ వన్డే

టీమిండియాకు 950వ వన్డే

1 - విశాఖపట్నం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న వన్డే టీమిండియాకు 950వ వన్డే కావడం విశేషం.

2 - వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో పిన్న వయస్కుడిగా కోహ్లీ (29 ఏళ్ల 353 రోజులు) నిలిచాడు. అంతకముందు సచిన్ (27 ఏళ్ల 341 రోజులు) వయసులో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

3 - సొంతగడ్డపై 4000 పరుగులు సాధించిన మూడో భారత బ్యాట్స్ మన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, ధోనిలు ఈ ఘనత సాధించారు.

నాలుగోసారి 150కిపైగా పరుగులు

నాలుగోసారి 150కిపైగా పరుగులు

4 - వన్డేల్లో నాలుగోసారి 150కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో 150కి పైగా నాలుగు సార్లు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతకముందు రోహిత్ శర్మ, సచిన టెండూల్కర్, డేవిడ్ వార్నర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

9 - అంతర్జాతీయ క్రికెట్‌లో 8000 పరుగులు చేసిన 9వ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.

13 - వన్డేల్లో పదివేల పరుగులు చేసిన 13వ క్రికెటర్ విరాట్ కోహ్లీ.

Story first published: Wednesday, October 24, 2018, 19:10 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X