Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ: కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ!

Stats: Virat Kohli scores his 15th Test century as captain

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఇంగ్లాండ్‌ పర్యటనలో 13.40 సగటుతో తీవ్రంగా నిరాశ పరిచిన కోహ్లీ ఈసారి మాత్రం సత్తా చాటాడు.

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో కూడా భారత్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లీపై తీవ్ర ఒత్తిడి పడింది. కానీ కోహ్లీ దానిని దరిచేరనీయలేదు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా ఏమాత్రం తత్తరపాటుకు లోనుకాలేదు.

మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇది కోహ్లీకి ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్ట్‌ సెంచరీ కాగా.. కెరీర్‌లో 22వ సెంచరీ. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఓ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

1
42374
కెప్టెన్‌గా కోహ్లీ 15వ సెంచరీ

కెప్టెన్‌గా కోహ్లీ 15వ సెంచరీ

కెప్టెన్‌గా సాధించిన 15వ సెంచరీ. కెప్టెన్లుగా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (25), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్(19) ఉన్నారు. ఇప్పుడు 15 సెంచరీలతో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ సాధించిన అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 57కు చేరుకుంది.

 100 పరుగులకే 4 వికెట్లు

100 పరుగులకే 4 వికెట్లు

ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రన్ ధాటికి భారత బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.

జో రూట్ ప్రయత్నం వృథా

జో రూట్ ప్రయత్నం వృథా

ముఖ్యంగా 160/6తో టీ విరామం తర్వాత భారత్ ఇన్నింగ్స్‌కు కోహ్లీ వెన్నెముకగా నిలిచాడు. కోహ్లీ వికెట్ కోసం రూట్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించాడు. మధ్యలో అనూహ్యమైన బౌన్స్‌తో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బాగా ఇబ్బందిపెట్టినా.. కోహ్లీ మాత్రం ఓపికగా వాటిని ఎదుర్కొన్నాడు. నాలుగు ఓవర్ల తేడాలో అశ్విన్, షమీ (2) ఔటైనా.. ఇషాంత్ 9 ఓవర్లు పాటు కోహ్లీకి అండగా నిలిచాడు.

172 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ

172 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ

బ్యాట్-ప్యాడ్‌తో బంతులు వృథా చేస్తూ పోయాడు. మధ్యలో అండర్సన్ బంతికి ఎల్బీ అయినా రివ్యూలో నాటౌట్‌గా తేలింది.. ఇక కోహ్లీ సెంచరీకి చేరువ అయిన సమయంలో ఇషాంత్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ (1) కోహ్లీకి మద్దతుగా నిలవగా ఎక్కువగా స్ట్రయికింగ్ చేస్తూ సింగిల్స్ కూడా తీయకుండా 172 బంతుల్లో కెరీర్‌లో 22వ సెంచరీ పూర్తి చేశాడు.

సెంచరీ అనంతరం కోహ్లీ దూకుడు

సెంచరీ అనంతరం కోహ్లీ దూకుడు

సెంచరీ అనంతరం కోహ్లీ తనదైన శైలిలో దూకుడుని ప్రదర్శించాడు. చెత్త బంతులు ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఆధిక్యం క్రమంగా తగ్గుతున్న తరుణంలో రషీద్ బంతికి భారీ షాట్ ప్రయత్నించి ఔటయ్యాడు. చివరి వికెట్‌కు కోహ్లీ 57 పరుగులు జోడిస్తే అందులో ఉమేశ్ చేసింది ఒక్క పరుగు కావడం విశేషం. దీంతో భారత్ 274 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

Story first published: Friday, August 3, 2018, 14:07 [IST]
Other articles published on Aug 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+