Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

7000 పరుగులు: కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 65 పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే. తద్వారా టీ20ల్లో 7 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

తన కెరీర్‌లో ఆడిన 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాదు అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు.

Stats: Virat Kohli becomes first Indian to 7000 T20 runs

అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన కెరీర్‌లో మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ ఇప్పటివరకు 10,571 పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా చూస్తే టీ20ల్లో 7000 పరుగులు చేసిన ఎనిమిదో బ్యాట్స్‌మెన్.

కోహ్లీకి ముందు టీ20ల్లో క్రిస్ గేల్, బ్రెండన్ మెక్‌కల్లమ్, కీరన్ పొలార్డ్, డేవిడ్ వార్నర్, బ్రాడ్ హాగ్, డ్వేన్ స్మిత్, షోయబ్ మాలిక్‌లు ఈ ఘనత సాధించారు. అంతేకాదు టీ20ల్లో 50కిపైగా ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన 36వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+