గణాంకాలు: 4వ వన్డేలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డులివే

హైదరాబాద్: ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ, అంబటి రాయుడులకు థాంక్స్. వీరిద్దరి సెంచరీల పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో టీమిండియా పర్యాటక వెస్టిండిస్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లలో శిఖర్ ధావన్(38) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరినప్పటికీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల ప్రభంజనం సృష్టించాడు.
సిరీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162) పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కొద్ది సేపటికే అంబటి రాయుడు కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించాడు. అయితే, రోహిత్ 162 పరుగుల వద్ద నర్స్ బౌలింగ్‌లో హేమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత అంబటి రాయుడు కూడా సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కాగా, 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన అంబటి రాయుడు ఆ తర్వాత రనౌటై పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్‌లు తమ అద్భుత బౌలింగ్‌తో కరీబియన్ జట్టును కకావికలం చేశారు. ఫలితం నాలుగో వన్డేలో భారత్‌కు 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరిదైన ఐదో వన్డే గురువారం (నవంబర్ 1)న తిరువనంతపురం వేదికగా జరగనుంది.
4వ వన్డేలో భారత జట్టు నమోదు చేసిన గణాంకాలివే:

420 పరుగులు చేసిన కోహ్లీ
1 - ప్రస్తుత సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 420 పరుగులు చేశాడు. వెస్టిండిస్ జట్టుపై ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులివే కావడం విశేషం.
1 - ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రోహిత్ శర్మ(162) మొట్టమొదటిసారి సెంచరీ సాధించాడు.
1 - వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ 150+పైగా స్కోరు నమోదు చేయడం ఇది ఏడోసారి. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 5 సార్లు ఈ ఘనత సాధించారు. తాజా సెంచరీతో రోహిత్ శర్మ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య 4 సార్లు 150కిపైగా పరుగుల సాధించి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ధావన్-రోహిత్‌ల జోడీ అరుదైన రికార్డు
2 - ఓపెనర్లుగా శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడీ సచిన్-సెహ్వాగ్‌ల 3919 పరుగుల రికార్డుని అధిగమించారు. భారత ఓపెనర్ల జోడీగా సచిన్-గంగూలీ జోడీ 6609 పరుగులు నమోదు చేశారు.
2 - బ్రబౌర్న్ స్టేడియంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 సిక్సులు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ సిక్సుల సంఖ్య 198కి చేరుకుంది. తద్వారా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(195) రికార్డుని అధిగమించాడు. ఈ జాబితాలో ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
2 - ఓపెనర్‌గా రోహిత్ శర్మ తన కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఈ జాబితాలో రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ కంటే సచిన్ టెండూల్కర్(45) ముందున్నాడు.

రోహిత్ శర్మ అరుదైన ఘనత
2 - ఒక సిరిస్‌లో 150కి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ కంటే ముందు హామిల్టన్ మసకద్జా(2009లో కెన్యాపై) ఈ ఘనత సాధించాడు.
2 - ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సాధించిన 162 పరుగులు వెస్టిండిస్ జట్టుపై ఓ భారత బ్యాట్స్‌మన్ నమోదు చేసిన అత్యధిక పరుగులు కావడం విశేషం.
4 - వన్డేల్లో రోహిత్ శర్మ 21 సెంచరీల మైలురాయిని అందుకునేందుకు 186 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. హషీం ఆమ్లా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ (49), కోహ్లీ (38), గంగూలీ (22) తర్వాత స్థానంలో ఉన్నాడు.

ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో రోహిత్ శర్మ ఇదే మొదటిసారి
5 - ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో రోహిత్ శర్మ మొట్టమొదటిసారి 300కు పైగా పరుగులు సాధించాడు. కేవలం కోహ్లీ మాత్రమే ఓ సిరిస్‌లో ఏడు సార్లు 300కుపైగా పరుగులు సాధించాడు.
13 - వన్డేల్లో 375కి పైగా పరుగులు చేయడం భారత్‌కు ఇది 13వ సారి కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ జట్టుకు ఇదే అత్యధికసార్లు కావడం విశేషం.
16 - ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 16 పరుగులే ఈ ఏడాది వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications