For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గణాంకాలు: తొలి వన్డేలో చరిత్ర సృష్టించిన రోహిత్, నమోదైన రికార్డులివే

Stats: Rohit Sharma creates history in the first ODI vs WI

హైదరాబాద్: టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ భారీ విజయంతో శుభారంభం చేసింది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

విండిస్ బ్యాట్స్‌మన్లలో షిమ్రాన్‌ హెట్‌మెయిర్ (106) కెరీర్‌లో మూడో సెంచరీ సాధించగా, కీరన్‌ పావెల్‌ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో చాహల్‌కు మూడు, షమీ, జడేజాలకు రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు. అనంతరం లక్ష్యం పెద్దదైనా భారత్‌ ఏమాత్రం ఇబ్బంది పడలేదు.

కెప్టెన్‌ కోహ్లీ (140), ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (152 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో 47 బంతులుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించడం విశేషం. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం విశాఖ వేదికగా జరగనుంది.

1
44266

ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరిచింది. తొలి వన్డేలో నమోదైన అనేక రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం.....

రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ

రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ

* విండీస్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (152) నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు. సెహ్వాగ్‌ (219) పరుగులతో ముందున్నాడు.

* 20 - వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీల సంఖ్య. భారత్‌ తరఫున సచిన్‌ (49), కోహ్లీ (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.

* 6 - రోహిత్‌ వన్డేల్లో ఆరు సార్లు 150కి పైగా స్కోర్లు సాధించాడు. గతంలో సచిన్, వార్నర్‌ ఐదేసిసార్లు ఈ ఘనత సాధించారు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో సెంచరీని నమోదు చేశాడు.

 సౌరవ్‌ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

సౌరవ్‌ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

* 3 - వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. ధోని (217), సచిన్‌ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

* 20 - రోహిత్‌ శర్మ వన్డే సెంచరీల సంఖ్య. అతడికిది 183వ ఇన్నింగ్స్‌. హషీమ్‌ ఆమ్లా (108), కోహ్లీ (133), డివిలియర్స్‌ (175)ల తర్వాత వేగంగా ఈ మార్కును అందుకున్నాడు.

* రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ. వెస్టిండీస్‌పై అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం.

కోహ్లీ, రోహిత్‌ శర్మ చేసిన సెంచరీల భాగస్వామ్యాల సంఖ్య

కోహ్లీ, రోహిత్‌ శర్మ చేసిన సెంచరీల భాగస్వామ్యాల సంఖ్య

* 5 - వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. మరే జోడీ మూడుకు మించి డబుల్ సెంచరీలు సాధించలేదు.

* 246 - తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.

* ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

కెప్టెన్‌‌గా కోహ్లీ సాధించిన సెంచరీలు

కెప్టెన్‌‌గా కోహ్లీ సాధించిన సెంచరీలు

* 14 - వన్డేల్లో కెప్టెన్‌గా 50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సాధించిన సెంచరీలు. పాంటింగ్‌ (22) తర్వాతి స్థానం అతడిదే. అతను 220 ఇన్నింగ్స్‌లకు అన్ని సెంచరీలు చేశాడు. ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది.

* 300కి పైగా పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌, హేడెన్‌, రూట్‌ సరసన నిలిచాడు.

* వన్డేల్లో అత్యధిక సెంచరీల (15) భాగస్వామ్యాలు ఏర్పరచిన ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్‌ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో సచిన్‌, గంగూలీ (26సార్లు) ఉన్నారు.

సచిన్‌ తర్వాత కోహ్లీనే

సచిన్‌ తర్వాత కోహ్లీనే

* 36 - వన్డేల్లో కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య. ఈ జాబితాలో సచిన్‌ (49) మాత్రమే అతనికంటే ముందున్నాడు. టెస్టుల్లో సాధించిన 24తో కలిపి మొత్తం శతకాల సంఖ్య 60కి చేరుకుంది.

* వెస్టిండీస్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన (81) భారత బౌలర్‌ షమి. ఈ జాబితాలో జడేజా (80)ను షమి అధిగమించాడు.

* భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 224వ క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన వన్డేలో మాజీ కెప్టెన్‌ ధోని చేతుల మీదుగా రిషభ్‌ పంత్‌ క్యాప్‌ను అందుకున్నాడు.

Story first published: Monday, October 22, 2018, 12:47 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+