
అత్యంత వేగంగా 300 సిక్సులు
అతడికంటే ముందు హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా, 150), విరాట్ కోహ్లీ (ఇండియా, 161), ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా, 166), సౌరవ్ గంగూలీ (ఇండియా, 174) ఉన్నారు. దీంతో పాటు రోహిత్ శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో అంతర్జాతీయ క్రికెట్‍లో మూడు ఫార్మాట్లలో అత్యంత వేగంగా 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు.

5000 పరుగులు చేసిన రెండో ఆటగాడు
అంతర్జాతీయ క్రికెట్‌లో 300 సిక్సులు బాదేందుకు గాను రోహిత్ శర్మ 301 ఇన్నింగ్స్‌లు తీసుకోగా... షాహిద్ అఫ్రిది కేవలం 276 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డుని అందుకున్నాడు. 43 టెస్టుల్లో 29 సిక్సులు, 181 వన్డేల్లో 189 సిక్సులు, 33 టీ20ల్లో 89 సిక్సులు బాదాడంతో రోహత్ శర్మ ఖాతాలో మొత్తం 301 సిక్సులు చేరాయి. దీంతో పాటు వన్డేల్లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా అరుదైన ఘనత సాధించాడు.

సచిన్ రికార్డుని అధిగమించిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ కంటే ముందు దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా ముందున్నాడు. 2012లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడైతే రోహిత్ శర్మను టాపార్డర్‌కు ప్రమోట్ చేశాడో దీంతో అతడి దశ తిరిగింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా తానెంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు సాధించే క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డుని సైతం రోహిత్ శర్మ అధిగమించాడు.

టాప్-5 జాబితాలో ముగ్గురు భారతీయులు
వన్డేల్లో 5000 పరుగులు సాధించేందుకు గాను సచిన్‌కు 110 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, రోహిత్ శర్మ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో భారత్‌కు చెందిన మరో క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ 123 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకుని ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ దిగ్గజం తిలకరత్నే దిల్షాన్ (121 ఇన్నింగ్స్‌లు)తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు అందుకున్న ఓపెనర్లు:
హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా) - 100 ఇన్నింగ్స్‌లు
రోహిత్ శర్మ (ఇండియా) - 102
సచిన్ టెండూల్కర్ (ఇండియా) - 111
తిలకరత్నే దిల్షాన్(శ్రీలంక) - 121
సౌరవ్ గంగూలీ(ఇండియా) - 123


Click it and Unblock the Notifications













