ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మూడో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (71), రహానే (70) పరుగులు చేసిన చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.

అగ్రస్ధానంలో రోహిత్ శర్మ
ఈ క్రమంలో గత నాలుగేళ్లలో ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్ధానంలో నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 79 ఇన్నింగ్స్‌ల్లో 113 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో 86 ఇన్నింగ్సుల్లో 106 సిక్స్‌లతో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ రెండో స్ధానంలో ఉన్నాడు.

మూడు ఫార్మెట్లలో 169 సిక్స్‌లు
ఇక మూడు ఫార్మెట్లలో కలిపి చూసుకుంటే ఓపెనర్‌గా రోహిత్ 143 ఇన్నింగ్స్‌ల్లో 169 సిక్స్‌లు బాదాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ 158 ఇన్నింగ్సుల్లో 153 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎక్కువ సిక్స్‌లు ఆస్ట్రేలియాపైనే బాదడం విశేషం.

మూడో వన్డేలో నాలుగు సిక్సులు
ఇదిలా ఉంటే ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ నాలుగు సిక్స్‌లు బాదాడు. అంతకముందు వరకు ఆస్ట్రేలియాపై అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా బ్రెండన్ మెక్‌కల్లమ్(61) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు.

ఆసీస్‌పై 65 సిక్స్‌లతో అగ్రస్థానంలో
మూడో వన్డేలో రోహిత్ శర్మ నాలుగు సిక్సులు బాదడంతో ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 65 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్(60)తో మూడో స్ధానంలో కొనసాగుతుండగా, మహేంద్ర సింగ్ ధోని(49) ఆరో స్థానంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications