For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా ఆరో ఏడాది: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Stats: Rohit breaks Tendulkar and Warners joint record for most 150-plus ODI scores

హైదరాబాద్: టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ భారీ విజయంతో శుభారంభం చేసింది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌ జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో అనేక రికార్డులను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించడంతో వరుసగా ఆరో ఏడాది 150 పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్‌లు ఐదేసి సార్లు, జయసూర్య, క్రిస్‌గేల్‌, హెచ్‌ ఆమ్లాలు నాలుగు సార్లు 150కిపైగా పరుగులు సాధించారు.

1
44266
 ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు

ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు

2013 నుంచి వరుసగా ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్‌ సెంచరీలుండటం విశేషం. దీంతో ఈ రికార్డుని అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. 2013లో 209, 2014లో 264, 2015లో 150, 2016లో 171, 2017లో 208, 2018లో 152 పరుగులు నమోదు చేశాడు.

గువహటి వన్డేలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డులివే:

గువహటి వన్డేలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డులివే:

* విండీస్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (152) నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు. సెహ్వాగ్‌ (219) పరుగులతో ముందున్నాడు.

* 20 - వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీల సంఖ్య. భారత్‌ తరఫున సచిన్‌ (49), కోహ్లీ (36), గంగూలీ (22) తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.

రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో సెంచరీని నమోదు

రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో సెంచరీని నమోదు

* 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి రోహిత్‌ వరుసగా 9 వన్డే సిరీస్‌లలో సెంచరీని నమోదు చేశాడు.

* 3 - వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ (194) మూడో స్థానానికి చేరాడు. ధోని (217), సచిన్‌ (195) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

* 20 - రోహిత్‌ శర్మ వన్డే సెంచరీల సంఖ్య. అతడికిది 183వ ఇన్నింగ్స్‌. హషీమ్‌ ఆమ్లా (108), కోహ్లీ (133), డివిలియర్స్‌ (175)ల తర్వాత వేగంగా ఈ మార్కును అందుకున్నాడు.

రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ

రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ

* రోహిత్‌కు ఇది వన్డేల్లో 20వ సెంచరీ. వెస్టిండీస్‌పై అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం.

* 5 - వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. మరే జోడీ మూడుకు మించి డబుల్ సెంచరీలు సాధించలేదు.

* 246 - తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది.

* ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

Story first published: Monday, October 22, 2018, 15:08 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+