For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గణాంకాలు: ఒక్క సెంచరీతో పృథ్వీషా ఖాతాలో రికార్డుల వెల్లువ

India vs west Indies : Prithvi Shaw Creates Records As A Debutant
Stats: Prithvi Shaw becomes youngest Indian to score century on Test debut

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఓపెనర్ పృథ్వీషా 99 బంతుల్లో సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

మ్యాచ్‌లో పృథ్వీషా 154 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 134 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవేంద్ర బిషు బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా భారత్ తరుపున అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా పృథ్వీషా నిలిచాడు. ఈ జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(187) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(177), గుండప్ప విశ్వనాధ్(137) ఉన్నారు. అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి చిన్న వయసు బ్యాట్స్‌మన్. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా అనేక రికార్డులు నమోదు చేశాడు.

1
44264

పృథ్వీషా సెంచరీతో నమోదైన రికార్డులు:

 షాకు ముందు ఏ భారత టీనేజర్ కూడా

షాకు ముందు ఏ భారత టీనేజర్ కూడా

0 - పృథ్వీషాకు ముందు ఏ భారత టీనేజర్ కూడా టెస్టుల్లో తొలి బంతిని ఎదుర్కొనలేదు. టెస్టుల్లో తొలి బంతని ఎదుర్కొన్న పిన్న వయస్కుడిగా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్ అంతకముందు హామిల్టన్ మసకడ్జ, తమీమ్ ఇక్బాల్, ఇమ్రాన్ ఫర్హాత్‌లు ఉన్నారు.

1 - భారత్ తరుపున అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. టెస్టుల్లో తొలి సెంచరీ సమయానికి పృథ్వీషా వయసు 18 ఏళ్ల 329 రోజులు. అంతేకాదు టెస్టుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పిన్న వయస్కుడిగా కూడా పృథ్వీషా నిలిచాడు.

అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన

అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన

2 - అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి చిన్న వయసు బ్యాట్స్‌మన్. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్. సచిన్ (17 ఏళ్ల 112 రోజులు) తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన ఏడో అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్.

3 - రాజ్ కోట్ టెస్టులో పృథ్వీషా కేవలం 99 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు.

నాలుగో బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా

నాలుగో బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా

4 - భారత్ తరుపున అతి తక్కువ వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా నిలిచాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ (9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు) తర్వాత అతి తక్కువ అనుభవంతో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్యాట్స్‌మన్‌గా పృథ్వి షా నిలిచాడు. పృథ్వి షా కేవలం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గత పదేళ్లలో భారత్‌కు ఆడిన అత్యంత చిన్న వయసు ప్లేయర్ కూడా ఇతడే కావడం విశేషం.

10 - అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన 10వ టీనేజర్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. జాక్సన్, జావెద్ మియాందాద్, కేడీ వాల్టర్స్, ఉమర్ అక్మల్, హామిల్టన్ మసకడ్జ, మహమ్మద్ ఆష్రపుల్, మహమ్మద్ వాసీం, ఆడ్రియన్ భరత్, సలీమ్ మాలిక్‌ల సరసన చేరాడు.

15వ భారత బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత

15వ భారత బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత

13 - భారత్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 13వ పిన్న వయస్కుడు పృథ్వీషా. ఇషాంత్ శర్మ(2007) తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడు.

15 - అరంగేట్ర టెస్టుల్లో సెంచరీ చేసిన 15వ భారత బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో పృథ్వీషా మాజీ క్రికెట్ దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, మహమ్మద్ అజహరుద్దీన్ ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 17:27 [IST]
Other articles published on Oct 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+