
28 వన్డేల్లో 52 వికెట్లు
ఇప్పటి వరకు బుమ్రా 28 వన్డేల్లో 52 వికెట్లను సాధించాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు. బుమ్రాకి ముందు అజిత్ అగార్కర్ 23 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. కాన్పూర్ వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు తీసి 47 పరుగులిచ్చాడు.

గుప్టిల్‌ను ఔట్ చేయడంతో 50 వికెట్ల క్లబ్‌లో
దీంతో బుమ్రా తన కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌ను ఔట్ చేయడంతో బుమ్రా 50 వికెట్ల క్లబ్‌లో చేరాడు. దీంతో భారత బౌలర్లలో వేగవంతమైన 50 వికెట్లు దక్కించుకున్న ఆటగాళ్లలో బుమ్రాది రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానం
ఆ తర్వాతి స్థానాల్లో మహమ్మద్ షమి(29), ఇర్ఫాన్ పఠాన్(31) ఉన్నారు. టాప్-4లో ఉన్న ఆటగాళ్లందరూ పేస్ బౌలర్లు కావడం విశేషం. ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో బుమ్రా 15 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో బుమ్రా మూడో స్ధానంలో నిలిచాడు.

50 వికెట్లు తీసిన భారత బౌలర్లు
వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్లు:
అజిత్ అగార్కర్ - 23 మ్యాచ్‌లు
జస్ప్రీత్ బుమ్రా - 28
మహమ్మద్ షమీ - 29
ఇర్ఫాన్ పఠాన్ - 31
అమిత్ మిశ్రా - 32
జహీర్ ఖాన్ - 34
ఎస్ శ్రీశాంత్ - 34
రవిచంద్రన్ అశ్విన్ - 34


Click it and Unblock the Notifications