27 సెంచరీలు: విరాట్ కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన హషీం ఆమ్లా

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా (120 బంతుల్లో 108 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చాన్నాళ్ల తర్వాత తనదైన స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఆమ్లా... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని అధిగమించాడు.

కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన ఆమ్లా
వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో 27 సెంచరీలు సాధించేందుకు గాను కోహ్లీకి 169 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది.

2017 జనవరిలో
2017, జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. తాజాగా, ఇప్పుడు కోహ్లీ రికార్డుని ఆమ్లా అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. మరో ఓపెనర్ హెన్‌డ్రిక్స్ (45) ఫర్వాలేదనిపించాడు.

5 వికెట్ల తేడాతో నెగ్గిన పాక్
ఆమ్లా, హెన్‌డ్రిక్స్ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. హఫీజ్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఆమ్లా కెరీర్‌లో 27వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications