Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఘనత: సచిన్, ద్రవిడ్ రికార్డులను బద్దలు కొట్టాడు

Stats: Alastair Cook becomes youngest player to play 150 Tests

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టుతో 150 టెస్టులాడిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్‌గా, ప్రపంచంలో ఎనిమిదవ క్రికెటర్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు.

అంతేకాదు 11 సంవత్సరాల 288 రోజుల్లోనే 150 టెస్టులాడిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ పేరిట ఉన్న రికార్డును కుక్ అధిగమించాడు. దీనితోపాటు అతి చిన్న వయస్సులోనే 150 టెస్టులాడిన ఆటగాడిగా అలెస్టర్ కుక్ మరో రికార్డును సాధించాడు.

అంతకముందు అతి చిన్న వయస్సులో 150 టెస్టులాడిన ఆటగాడిగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ 35 ఏళ్ల 106 రోజులకు ఈ ఘనత సాధించగా ఇప్పుడు అలెస్టర్ కుక్ 32 ఏళ్ల 154 రోజులకే 150 టెస్టులు ఆడాడు. తద్వారా సచిన్ రికార్డుని అధిగమించాడు.

పెర్త్ టెస్టులో నెలకొన్న రికార్డులు:

* ఇంగ్లాండ్ తరపున 150 టెస్టులాడిన క్రికెటర్‌గా అరుదైన ఘనత.
* అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టెస్టులాడిన ఆటగాళ్లలో అలెస్టర్ కుక్ ఎనిమిదవ ఆటగాడు.
* గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో కుక్ స్కోర్ కనీసం 50 పరుగలకు చేయక పోవడం విశేషం.
* 1900 తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టుల్లో తొలి రోజు 300పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి.
* వాకా స్టేడియంలో తొలి టెస్టు సెంచరీ చేసిన ఐదో ఇంగ్లాండ్ ఆటగాడిగా డేవిడ్ మిలన్ నిలిచాడు. అంతకముందు బ్రియాన్ లుక్హర్ట్ (1970), క్రిస్ బ్రాడ్ (1986), జాక్ రిచర్డ్స్ (1986), బెన్ స్టోక్స్ (2013)లు ఈ ఘనత సాధించారు.
* 2013 పెర్త్‌ టెస్టులో బెన్ స్టోక్స్ (120) సెంచరీ తర్వాత యాషెస్ సిరిస్‌లో డేవిడ్ మలన్ మళ్లీ నాలుగేళ్లకు సెంచరీని నమోదు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 18:13 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+