For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఆరో క్లీన్ స్వీప్: కోహ్లీ కెప్టెన్సీలో మూడోసారి

కోహ్లీసేన విజయం పరిపూర్ణమైంది. 3-0తో టెస్టు సిరిస్‌ను గెలుచుకున్న కోహ్లీసేన, అదే స్ఫూర్తితో వన్డే సిరిస్‌ను కూడా 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్‌ చేయడం ద్వారా కో

By Nageshwara Rao

హైదరాబాద్: కోహ్లీసేన విజయం పరిపూర్ణమైంది. 3-0తో టెస్టు సిరిస్‌ను గెలుచుకున్న కోహ్లీసేన, అదే స్ఫూర్తితో వన్డే సిరిస్‌ను కూడా 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్‌ చేయడం ద్వారా కోహ్లీసేన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఈ విజయంతో శ్రీలంకను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసిన తొలి పర్యాటక జట్టుగా కోహ్లీసేన సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఐదో వన్డేలో ఏ దశలో కూడా భారత జట్టుకు పోటీ ఇవ్వలేకోయిన శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

Stats: 6th clean sweep in ODIs for India, 3rd under Virat Kohli

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీతో రాణించగా, భారత పేసర్ భువనేశ్వర్‌ కుమార్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఐదు వికెట్లు తీశాడు. దీంతో వన్డే సిరిస్‌ను 5-0తో భారత్ గెలుచుకుంది. తాజా సిరిస్‌ను కలుపుకుని భారత్ ఆరుసార్లు వన్డేల్లో క్లీన్ స్వీప్ విజయాలను సాధించింది.

ఈ ఆరింటిలో మూడు క్లీన్‌స్వీప్‌ విజయాలు విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోనే భారత్‌కు దక్కడం విశేషం. కోహ్లీ నాయకత్వంలో 2013లో జింబాబ్వేను 5-0తో ఓడించిన భారత్‌.. 2014-15లో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకపై 5-0తో, తాజాగా మరోసారి అదే శ్రీలంకపై 5-0తో క్లీన్ స్వీప్ విజయాలను సాధించింది.

ఇక, ధోని కెప్టెన్సీలో భారత్‌కు రెండుసార్లు క్లీన్ స్వీప్ సిరీస్‌ విజయాలు లభించాయి. 2008-09లో ఇంగ్లండ్‌పై 5-0తో, 2010లో ఇంగ్లండ్‌పైనే 5-0తో టీమిండియా రెండుసార్లు క్లీన్‌స్వీప్‌ విజయాలు సాధించింది. ఇక, గౌతం గంభీర్‌ నాయకత్వంలో 2010-11లో న్యూజిలాండ్‌పై ఓసారి క్లీన్‌స్వీప్‌ విజయాన్ని సాధించింది.

స్వదేశంలో శ్రీలంకపై మూడు ఫార్మెట్లలోనూ పరాజయాల కన్నా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్‌ నిలించింది. టెస్టుల్లో భారత్‌ 9 విజయాలు సాధించగా, ఏడుసార్లు ఓడిపోయింది. వన్డేల్లో 28సార్లు గెలుపొంది.. 27సార్లు ఓడిపోయింది. ఇక, టీ20ల్లో 2-0 విజయాలతో భారత్‌ ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+