Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

19 ఏళ్లకే సెంచరీ: ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల మోత, ఎవరీ దేవదత్ పాడిక్కల్!

Devdutt Padikkal Scores 122 In Syed Mushtaq Ali T20 Trophy || Oneindia Telugu
Stats: 19-year-old Devdutt Padikkal scores 122* in Syed Mushtaq Ali T20 Trophy

హైదరాబాద్: దేవదత్ పాడిక్కల్(122 నాటౌట్, 60 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీతో రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో దేవదత్ పాడిక్కల్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

దేవదత్ పాడిక్కల్ వయసు 19 ఏళ్ల 127 రోజులు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించాడు. 18 ఏళ్ల వయసులో విజయ్ జోల్ 2013లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 109 పరుగులతో చేసిన సెంచరీయే ఇప్పటికీ రికార్డు కావడం గమనార్హం.

చేధనలో అత్యధిక పరుగుల రికార్డు

చేధనలో అత్యధిక పరుగుల రికార్డు

ఈ మ్యాచ్‌లో దేవదత్ పాడిక్కల్(122 నాటౌట్) సాధించిన సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ చరిత్రలోనే చేధనలో అత్యధిక పరుగులు కావడం విశేషం. ఈ క్రమంలో 2017-18 ఎడిషన్‌లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్(116) హిమాచల్ ప్రదేశ్‌పై నెలకొల్పిన రికార్డు ఇప్పుడు బద్దలైంది.

టీ20 చేధనలో సైతం

టీ20 చేధనలో సైతం

టీ20 చేధనలో ఓ కర్ణాటక బ్యాట్స్‌మన్ నెలకొల్పిన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం. 2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున పాల్ వాల్తాటి(120 నాటౌట్) నెలకొల్పిన రికార్డు కూడా కనుమరుగైంది.

184 పరుగులు చేసిన ఆంధ్ర

184 పరుగులు చేసిన ఆంధ్ర

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక మరో ఏడు బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని చేధించింది. రెండో ఓవర్‌కే కర్ణాటక జట్టు ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పాడిక్కల్ చేలరేగాడు.

24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

4.3 ఓవర్లకు కృష్ణప్ప గౌతమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించిన దేవదత్ పాడిక్కల్... కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన దేవదత్ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచేందుకు మరో 23 బంతులే తీసుకోవడం విశేషం.

Story first published: Tuesday, November 12, 2019, 15:08 [IST]
Other articles published on Nov 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+