మ్యాచ్ హైలెట్స్: నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై సిరిస్ నెగ్గిన లంకేయులు

హైదరాబాద్: నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే సిరిస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వన్డే మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (98 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అనంతరం 239 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 44.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి విజయం సాధించింది.
శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (75 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఏంజెలో మాథ్యూస్ (57 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మూడు వన్డేల సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో శ్రీలంక అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం....

12 ద్వైపాక్షిక వన్డే సిరిస్‌లను కోల్పోయిన లంక
12 - ఈ సిరిస్‌కు ముందు శ్రీలంక 12 ద్వైపాక్షిక వన్డే సిరిస్‌లను కోల్పోయింది. చివరగా శ్రీలంక 2016లో ఐర్లాండ్‌తో ఐర్లాండ్ వేదికగా జరిగిన రెండు వన్డేల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
2015 - తర్వాత స్వదేశంలో శ్రీలంక నెగ్గిన మొట్టమొదటి వన్డే సిరిస్ ఇది. 2015లో సొంతగడ్డపై వెస్టిండిస్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 3-0తో లంకేయలు నెగ్గారు. మళ్లీ 2019లో బంగ్లాపై శ్రీలంక వన్డే సిరిస్‌ను నెగ్గింది. ఈ మధ్య కాలంలో శ్రీలంక ఐదు వన్డే సిరిస్‌లను కోల్పోయింది. అయితే, 2017లో బంగ్లాతో జరిగిన మూడు వన్డేల సిరిస్ మాత్రం 1-1తో సమం చేసింది.

200 పరుగుల లక్ష్యాన్ని సైతం
10 - చేధనలో 10 వన్డే ఓటములకు కూడా శ్రీలంక ఈ సిరిస్ విజయంతో చెక్ పెట్టింది. శ్రీలంక చేధనలో చివరగా నెగ్గిన వన్డే మ్యాచ్ కూడా బంగ్లాదేశ్‌పైనే కావడం విశేషం. గతేడాది జనవరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.
2017 - శ్రీలంక చివరగా వన్డేల్లో 200కిపైగా పరుగులను గతేడాది జులైలో చేధించింది. 2017లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 311 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ రెండు విజయాల మధ్యలో శ్రీలంక 14 వన్డేల్లో వరుసగా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

బంగ్లా మూడో క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్
6090 - వన్డేల్లో బంగ్లా క్రికెటర్ ముష్పికర్ రహీమ్ 6000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తమీమ్ ఇక్బాల్(6890), షకీబ్ ఉల్ హాసన్(6323)ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ముష్పికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు.

వన్డేల్లో 50 వికెట్లు తీసిన ధనుంజయ
50 వికెట్లు - శ్రీలంక బౌలర్ అకేలా ధనుంజయ వన్డేల్లో 50 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. 35 వన్డేల్లో ధనుంజయ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక తరుపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఇక, లంక తరుపున 50 వికెట్లను అత్యంత వేగంగా తీసిన స్పిన్నర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications