ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆఖరి ఓవర్ ఏదో తెలుసా?


హైదరాబాద్: వాంఖడె వేదికగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో పరుగులు చేయడంలో తడబడింది. అయితే, చివరి రెండు ఓవర్లలో హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లు చెలరేగడంతో 45 పరుగులు రాబట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

29 పరుగులిచ్చిన డ్వేన్ బ్రావో
ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఆఖరి ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో అశోక్ దిండా అగ్రస్థానంలో నిలిచాడు.

అగ్రస్థానంలో అశోక్ దిండా
2017లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆశోక్ దిండా అత్యధికంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, ఆశోక్ దిండా కూడా హార్ధిక్ పాండ్యా బాధితుడే కావడం విశేషం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిండా వేసిన ఆఖరి ఓవర్‌లో పాండ్యా 6, 6, 6, 4, 6 పరుగులు రాబట్టాడు.

శివమ్ మావి కూడా
ఇక, ఆఖరి బంతిని దిండా వైడ్‌గా సంధించడం మరో పరుగు జత అయింది. ఆ తర్వాత బంతికి బై రూపంలో మరో పరుగు రావడంతో మొత్తం 30 పరుగులను ముంబై బ్యాట్స్‌మెన్ రాబట్టారు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ శివమ్ మావి ఆఖరి ఓవర్‌కి 29 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌కి ఇది తొలి మ్యాచ్.

ఈ సీజన్‌లో ఉనాద్కత్
ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన శ్రేయాస్ అయ్యర్ ఆఖరి ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఒక బౌండరీతో 28 పరుగులు రాబట్టాడు. ఒక వైడ్ కూడా ఉండటంతో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉనాద్కత్ 28 పరుగులు సమర్పించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications