
హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకు సొంతగడ్డపై టీమిండియా ఒక్క సిరిస్ (మూడు ఫార్మాట్లలో) ఓడిపోలేదు.

India vs Sri Lanka 2017 3rd ODI Score Card
విశాఖ వన్డేలో టీమిండియా నమోదు చేసిన రికార్డులు:
* భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
* 1980-88 మధ్య కాలంలో వెస్టిండిస్ 14 ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయం సాధించింది. ఇప్పటికీ ఇదే అంతర్జాతీయ రికార్డు.
* 9 - శ్రీలంకపై భారత్ వరుసగా గెలిచిన సిరిస్‌లు.
* స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా ఇప్పటివరకు 51 వన్డేలు ఆడింది. అందులో 36లో విజయం సాధించగా, 12లో ఓటమిపాలైంది. మిగిలిన మూడు వన్డేల్లో ఫలితం తేలలేదు.
* 90 - వన్డేల్లో శ్రీలంకపై టీమిండియా సాధించిన విజయాలు.
* ఈ ఏడాది టీమిండియా స్వేదశంలో జరిగిన ఒక్క వన్డే సిరిస్‌లో కూడా ఓడిపోలేదు.
* ఈ ఏడాది 29 వన్డేలాడిన శ్రీలంక కేవలం ఐదింటిలో మాత్రమే గెలిచింది.
* 12 - వన్డేల్లో ధవన్ సెంచరీల సంఖ్య ఇది.
* శ్రీలంకపై అత్యధికంగా ధావన్ 4 సెంచరీలు నమోదు చేశాడు.
* భారత్ తరఫున అత్యంత వేగం (95 ఇన్నింగ్స్‌లో)గా నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా ధావన్ నిలిచాడు.
* వన్డేల్లో ధావన్ 4000 పరుగులు చేశాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్ ధావన్. ఆమ్లా (81 ఇన్నింగ్స్‌ల్లో) అగ్రస్ధానంలో ఉన్నాడు.
* వన్డేల్లో మూడోసారి ధావన్ మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు అందుకున్నాడు.
* వన్డేల్లో కుల్దీప్ యాదవ్ (3/42) రెండో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్‌ను నమోదు చేశాడు. జూన్ 30, 2017లో వెస్టిండిస్‌పై (3/41) కుల్దీప్ అత్యుత్తమం.
* ఉపుల్ తరంగ వన్డేల్లో 36వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. భారత్‌పై ఆరోది కావడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.