For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ షా ఖాతాలో ఏకైక ఫీట్: హైదరాబాద్ టెస్టులో నమోదైన రికార్డులివే

 Statistical Highlights: Prithvi Shaw becomes youngest ever to achieve unique feat

హైదరాబాద్: అందరూ ఊహించినట్టే వెస్టిండిస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన పర్యాటక వెస్టిండిస్ జట్ట మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. చివరగా 2013లో సచిన్ ఫేర్‌వెల్ సిరిస్ కోసం భారత్ పర్యటనకు వచ్చిన వెస్టిండిస్ అప్పట్లో 2-0తో సిరిస్‌ను చేజార్చుకుంది.

మళ్లీ ఇప్పుడు 2-0తో సిరిస్‌ను కోల్పోయింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగులతో ఓటమి పాలైన వెస్టిండిస్.... రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా ఈ సిరిస్‌లో విండిస్ బ్యాట్స్‌మన్ భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు పేలవంగా ఉంది.

72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌( 33 నాటౌట్‌), పృథ్వీ షా(33 నాటౌట్‌)లు వికెట్‌ పడకుండా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ని మూడు రోజుల్లోనే ముగించింది.

ఈ టెస్టు విజయం సొంతగడ్డపై టీమిండియాకు వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. హైదరాబాద్ టెస్ట్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దామా!

వరుసగా పది సిరిస్ విజయాలను సాధించిన భారత్

వరుసగా పది సిరిస్ విజయాలను సాధించిన భారత్

10 - స్వదేశంలో భారత్‌ వరుసగా సాధించిన సిరీస్‌ విజయాల సంఖ్య. దీంతో సొంతగడ్డపై అత్యధిక వరుస సిరీస్‌లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (రెండుసార్లు 10 చొప్పున; 1994-2000 మధ్య; 2004-08 వరకు) పేరిట ఉన్న రికార్డును భారత్‌ సమం చేసింది. 2013 నవంబరులో వెస్టిండీస్‌పై 2-0 విజయంతో సొంతగడ్డపై భారత్‌ జైత్రయాత్ర మొదలైంది.

10 - భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌. గతంలో జవగళ్‌ శ్రీనాథ్‌ (13 కోల్‌కతాలో పాకిస్తాన్‌పై 1999లో), కపిల్‌దేవ్‌ (రెండుసార్లు; 11 చెన్నైలో పాక్‌పై 1980లో; 10 అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై 1983లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.

18 - ఈ వయసులో భారత్‌ విజయం సాధించే పరుగులు చేసిన అతి పిన్నవయస్కుడిగా పృథ్వీ షా నిలిచాడు.

అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు

అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు

3 - విండిస్‌తో సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్‌లలో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కాయి. 2011లో అశ్విన్, 2013లో రోహిత్‌ ఈ ఘనత సాధించారు. ఈ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షాకి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.

4 - అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు పొందిన పదో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి నాలుగో క్రికెటర్‌గా పృథ్వీ షా అరుదైన గుర్తింపు పొందాడు.

23 టెస్టుల్లో విజయం సాధించిన భారత్

23 టెస్టుల్లో విజయం సాధించిన భారత్

23 - భారత జట్టు 2013 నవంబరు నుంచి ఇప్పటిదాకా ఆడిన 29 టెస్టుల్లో సాధించిన విజయాలు. ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. 5 టెస్టులు మాత్రమే డ్రా అయ్యాయి.

3 - భారత్‌ సొంతగడ్డపై చివరగా ఆడిన మూడు టెస్టుల్లోనూ మూడు రోజుల్లోపే విజయం సాధించింది. ఈ సిరీస్‌ ముందు జరిగిన ఆఫ్ఘనిస్థాన్‌ను రెండే రోజుల్లో ఓడించింది.

7 - వెస్టిండీస్‌పై వరుసగా భారత్‌ సాధించిన సిరీస్‌ విజయాలు. 2002-03 నుంచి సొంతగడ్డపై ఆ జట్టుతో ఆడిన ఏడు సిరీస్‌ల్లోనూ టీమ్‌ఇండియాదే విజయం. మొత్తం 21 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా భారత్‌ ఓడలేదు.

7 - టెస్టుల్లో వెస్టిండిస్ ఓపెనర్లు డకౌట్ అయిన సందర్భాలు.

 రాహుల్ ద్రవిడ్ సరసన రిషబ్ పంత్

రాహుల్ ద్రవిడ్ సరసన రిషబ్ పంత్

2- మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత (92, 93 శ్రీలంకపై 1997లో) వరుస ఇన్నింగ్స్‌లలో 90ల్లో ఔటైన రెండో భారత క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు.

3 - రవిశాస్త్రి (న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్‌లో 1981లో), కపిల్‌దేవ్‌ (ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 1985లో) తర్వాత ఓ టెస్టులో నాలుగు బంతుల తేడాలో మూడు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌‌గా ఉమేశ్‌ యాదవ్‌ నిలిచాడు.

4222* - ఆసియా ఖండం తరుపున కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

Story first published: Monday, October 15, 2018, 13:29 [IST]
Other articles published on Oct 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+