కోహ్లీ సేన చేతిలో ఓడినా: అరుదైన రికార్డు సృష్టించిన బంగ్లా
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి పాలైనా, అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది.
తొలిసారి భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాతో అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. నిజానికి టీమిండియా అద్భుతమైన ఫామ్ ముందు మూడు రోజులకే టెస్టు మ్యాచ్ ముగుస్తుందని అందరూ భావించారు.
అయితే బంగ్లాదేశ్ మాత్రం ఆఖరి రోజైన సోమవారం వరకు పోరాటాన్ని కొనసాగించి అందరి క్రీడా విమర్శకుల ప్రశంసలందుకుంది. హైదరాబద్ టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీతో రాణించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ పోరాట ప్రతిమ
అతడికి తోడు సీనియర్ ఆటగాళ్లు షకిబ్ ఉల్ హాసన్, మోహిదీ హాసన్‌లు అర్ధసెంచరీలతో బంగ్లాను పటిష్ట స్థితికి చేర్చారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లాదేశ్ తన పోరాట ప్రతిమను చూపించింది. రెండో ఇన్నింగ్స్‌లో మహ్మదుల్లా అర్ధసెంచరీతో రాణిస్తే, మరో ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల పరుగులు సాధించారు.

100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్
ఇక, బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తద్వారా బంగ్లాదేశ్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. గత 17 ఏళ్ల కాలంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసిన రెండో విదేశీ జట్టుగా బంగ్లాదేశ్ అవతరించింది.

భారత్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు న్యూజిలాండ్ పేరిట
2000వ సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్‌పై భారత్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2003, అక్టోబర్ 8వ తేదీన టీమిండియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

250 పరుగులతో రెండో స్ధానంలో నిలిచిన బంగ్లాదేశ్
అదే భారత్‌లో ఒక విదేశీ జట్టు నమోదు చేసిన నాలుగో ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు. ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ రెండో స్ధానంలో నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన ఏకైక టెస్టులో 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications