ధోని కెరీర్‌లోనే ఆసక్తికరం: కెప్టెన్‌గా తొలి మ్యాచ్, చివరి మ్యాచ్ ఇలా!


హైదరాబాద్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనికి 200వ వన్డే కావడం విశేషం. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రెండేళ్లకు మరోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది.

ధోని మాత్రం ఎప్పటిలాగే
చాలా రోజుల తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ధోని మాత్రం ఎప్పటిలాగే కెప్టెన్ కూల్‌గానే ఈ మ్యాచ్‌లో కూడా వ్యవహారించాడు. భారత్‌కు అత్యధిక వయస్సు (37 ఏళ్ల 80 రోజులు)లో నాయకత్వం వహించిన ఆటగాడిగా అజహరుద్దీన్ (36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని ఈ సందర్భంగా అధిగమించాడు.

టైగా ముగిసిన భారత్-ఆప్ఘన్ మ్యాచ్
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత విజయానికి రెండు బంతుల్లో ఒక పరుగు అవసరమైన సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది.

ధోని కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కూడా టై
దీంతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ధోని కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్ కూడా టైగా ముగిసింది. 2007, సెప్టెంబర్ 14వ తేదీన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ధోని కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత 141 పరుగులు చేసింది.

బౌల్ ఔట్‌లో పాక్‌పై భారత్ విజయం
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ టైగా ముగియడంతో ఆ తర్వాత బౌల్ అవుట్ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బౌల్ ఔట్‌లో భారత్, పాకిస్థాన్‌పై 3-0 తేడాతో విజయం సాధించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications