
బంగబందు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022 ఫైనల్స్‌కు చేరువలో ఉంది. ఇప్పటికే ఫార్చూన్ బారిషల్ ఫైనల్స్‌కు చేరుకోగా... ఈ రోజు జరిగే క్వాలిఫయర్ 2లో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకునేందుకు చత్తోగ్రామ్ ఛాలెంజర్స్ మరియు కోమిల్లా విక్టోరియన్స్ మధ్య పోరు జరగనుంది. ఇందుకు ఢాకాలోని షేర్-ఈ-బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. రెండు సార్లు చాంపియన్లుగా నిలిచిన కోమిల్లా విక్టోరియన్స్ చేతిలో చత్తోగ్రామ్ ఛాలెంజర్స్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచుల్లోను పరాజయం పాలైంది. అయితే ఈ సారి ఎలాగైనా విక్టోరియన్స్ పై చాలెంజర్స్ గెలిచి ఫైనల్స్‌కు చేరుకోవాలని ఉబలాట పడుతుండగా... రెట్టించిన ఉత్సాహంతో విక్టోరియన్స్ బరిలోకి దిగుతోంది.
ఇక కోమిల్లా విక్టోరియన్స్ మరియు చత్తోగ్రామ్ ఛాలెంజర్స్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను, అతివేగవంతమైన లైవ్ స్కోర్స్ మ్యాచ్ హైలైట్స్ అన్నీ ప్రముఖ స్పోర్టింగ్ యాప్ ఫ్యాన్ కోడ్‌లో వీక్షించొచ్చు. లేదా www.fancode.comకు లాగిన్ అయి లైవ్‌లో వీక్షించొచ్చు. లీగ్ దశలో రెండు జట్లు రెండు సార్లు పోటీ పడగా రెండు సార్లు ఛాలెంజర్స్ జట్టు ఓటమిపాలైంది. ఇక బంగబంధు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో క్వాలిఫైయర్-1 విక్టోరియన్స్ మరియు ఫార్చూన్ బారిషల్ మధ్య జరగగా ఫార్చూన్ బారిషల్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.
ఇక ఈ టోర్నమెంటులో పలువురు స్టార్ ప్లేయర్లు ఆకట్టుకున్నారు. ఇందులో ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఫార్చున్ బారిషల్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో షకీబల్ హసన్ రన్స్ పరంగా టాప్ 5లో వికెట్స్ పరంగా కూడా టాప్ 5లో ఉన్నాడు. ఇక చత్తోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు విల్ జాక్స్ ఈ సీజన్‌లో 398 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఫాఫ్ డూ ప్లెసిస్ కోమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇక ఫాఫ్ డూప్లెసిస్ బుధవారం జరిగే క్వాలిఫైయర్ -2లో విక్టోరియన్స్ జట్టులో కీలకంగా మారనున్నాడు. ఇక ఫార్చూన్ బారిషల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక బుధవారం సాయంత్రం 5 గంటలకు జరిగే బంగబంధు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్ -2 మ్యాచ్‌ను ఫ్యాన్‌కోడ్ యాప్‌పై లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.