For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ విశ్వరూపాన్ని చూడటం మిస్ అయ్యారా? - బాల్ బై బాల్ రీ టెలికాస్ట్.. డీటెయిల్స్ ఇవే!!

Star Sports will be streaming yesterdays India Vs Pakistan full match repeat from 8pm tonight

మెల్‌‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ- ఈ మ్యాచ్‌లో విశ్వరూపాన్ని చూపాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును గెలుపుబాట పట్టించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు కింగ్ కోహ్లీ.

సత్తాకు సాక్ష్యం..

సత్తాకు సాక్ష్యం..

విరాట్ కోహ్లీ సత్తాకు నిలువుటద్దంలా మారిందీ ఇన్నింగ్. ప్రతి ఒక్కరు కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్‌ను ఆశించారు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అతని పనైపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్‌తో కోహ్లీ ఆటతీరు మళ్లీ ట్రాక్‌లో పడింది. ఈ టోర్నమెంట్ తరువాత ఆడిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు.

 కోహ్లీ విశ్వరూపం..

కోహ్లీ విశ్వరూపం..

అదే ఊపుతో పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డాడు కోహ్లీ. మెల్‌బోర్న్‌లో ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్‌తో ఎన్నో విమర్శలకు చెక్ చెప్పాడు.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు రికార్డులు మటాష్ అయ్యాయి. టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీని కొట్టే మొనగాడు సమీప భవిష్యత్తులో ఉండడు. అటు పాకిస్తాన్‌ బౌలర్లపైనా సునామీలా విరుచుకుపడే భారత క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

 కోటీ 80 లక్షలమందికిపైగా..

కోటీ 80 లక్షలమందికిపైగా..

ఈ మ్యాచ్‌- వ్యూవర్ షిప్ పాత రికార్డులను బద్దలు కొట్టింది. కోటి 80 లక్షలమందికి పైగా అభిమానులు ఈ మ్యాచ్‌ను తిలకించారు. ఇలాంటి వ్యూస్ ఇదివరకెప్పుడూ రాలేదు. దీని దెబ్బకు ఇదివరకటి రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ప్రత్యక్షంగానే లక్షమందికి పైగా ఈ మ్యాచ్‌ను చూశారంటే దీనికి ఉన్న ఫీల్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిసామర్థ్యం లక్ష కాగా.. దీన్ని మించి ఫ్యాన్స్ మ్యాచ్ చూడ్డానికొచ్చారు.

కొత్త రికార్డ్స్..

కొత్త రికార్డ్స్..

ఇప్పటివరకు స్టార్ స్పోర్ట్స్ వ్యూవర్‌షిప్‌లో రికార్డ్.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కోటీ 30 లక్షల వ్యూస్‌ వచ్చాయా మ్యాచ్‌కు. అదే హయ్యెస్ట్ అనుకుంటే తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో ఈ రికార్డు చెరిగిపోయింది. వ్యూస్ భారీగా పెరిగాయి. కోటీ 80 లక్షలమందికి పైగా ఫ్యాన్స్‌ భారత్- పాక్ మ్యాచ్ చూశారు.

 కంప్టీల్ మ్యాచ్ రీటెలికాస్ట్..

కంప్టీల్ మ్యాచ్ రీటెలికాస్ట్..

అయినప్పటికీ- ఇంకా ఈ మ్యాచ్‌ను చూడని వారి కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని పునఃప్రసారం చేయనుంది. ఇవ్వాళ రాత్రి ఇదే మ్యాచ్‌ను రీటెలికాస్ట్ చేయాలని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది. బాల్ బై బాల్, పూర్తి మ్యాచ్‌ను రీటెలికాస్ట్ చేయనున్నట్లు స్టార్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యాజమాన్యం తెలిపింది.

Story first published: Monday, October 24, 2022, 11:56 [IST]
Other articles published on Oct 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+