For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli : పీఎస్ఎల్ ఆడుతున్నావని.. కోహ్లీ కన్నా బాబర్ బెటర్ అంటావా?

Star playing in PSL says Babar better than Virat Kohli

ఎంత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడుతుంటే మాత్రం.. భారత ఆటగాళ్లపై విషం కక్కాల్సిందేనా? అని సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పీఎస్ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున మిల్లర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో కోహ్లీ కన్నా బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్ బాగుంటుందని మిల్లర్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.

ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీని మోడ్రన్ గ్రేట్‌గా పిలుస్తారు. కొత్త తరంలో కోహ్లీ కన్నా మెరుగైన బ్యాటర్ లేరని అంటారు. అతని ఐకానిక్ షాట్ కవర్ డ్రైవ్ అని అందరికీ తెలిసిందే. అలాగే పాకిస్తాన్ క్రికెట్‌ చరిత్రలో అద్భుతమైన బ్యాటర్లలో బాబర్ ఆజమ్ ఒకడు. సూపర్ ఆటతో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఎదిగిన అతన్ని చాలా మంది కోహ్లీతో పోల్చడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది మాజీలు, నిపుణులు మాత్రం వీళ్లిద్దర్నీ పోల్చడం సరికాదని, ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ తనకంటూ ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకున్నాడని, బాబర్ ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని అంటారు.

కానీ పాకిస్తాన్ అభిమానులు మాత్రం కోహ్లీ కన్నా బాబర్ సూపర్ అంటూ నెట్టింట్ కామెంట్లు చేసి ట్రోల్ అవుతుంటారు. ఇప్పుడు డేవిడ్ మిల్లర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. బాబర్ ఆజమ్, కోహ్లీల్లో ఎవరి కవర్ డ్రైవ్ బాగుంటుందని అడిగితే తాను బాబర్‌కే ఓటేస్తానని చెప్పాడు. అలాగే షహీన్ అఫ్రిదీ, బుమ్రాల్లో ఎవరి యార్కర్లు సూపర్ అని అడిగితే బుమ్రా యార్కర్లే అద్భుతం అన్నాడు. బుమ్రాను మెచ్చుకున్నా సరే కోహ్లీని ఇలా తక్కువ చేయడం అభిమానులకు నచ్చలేదు. దీంతో ఎంత పీఎస్ఎల్ ఆడుతుంటే మాత్రం భారత స్టార్లను ఇలా కించపరచాలా? అని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Saturday, February 25, 2023, 7:00 [IST]
Other articles published on Feb 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+