Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : అందుకే సీఎస్‌కేను మధ్యలోనే వదిలేశా.. స్టార్ పేసర్ సంచలన వ్యాఖ్యలు

Star pacer slams Chennai Super Kings before Mini Auction

ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో హాట్ పిక్‌గా మారిన బౌలర్లలో పసికూన ఐర్లాండ్‌కు చెందిన జోష్ లిటిల్ కూడా ఒకడు. ఎడం చేతి వాటం పేసర్ అయిన లిటిల్.. భారత్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా రాణించాడు. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టినీ తిప్పుకున్నాడు. గతంలో కూడా ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతను.. ఐపీఎల్‌ బెస్ట్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రెండు ఓవర్లు ఇచ్చేవారు..

రెండు ఓవర్లు ఇచ్చేవారు..

గతేడాది ఐపీఎల్‌లో లిటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతన్ని నెట్ బౌలర్‌గా ఉపయోగించుకుంది. అయితే చెన్నై క్యాంపులో తనకు ఏమాత్రం విలువ ఉండేది కాదని లిటిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను కూడా ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడిననే విషయాన్ని ఎవరూ గుర్తించేవారు కాదన్నాడు. నెట్స్‌లో తనకు బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇచ్చేవారు కాదని, తను బౌలింగ్ అడిగినా ఎవరూ పట్టించుకునే వారు కాదని ఆరోపణలు చేశాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక రెండు ఓవర్లు బౌలింగ్ చేయమనే వారని, ఆ తర్వాత మళ్లీ పక్కన కూర్చోబెట్టే వారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కరెక్ట్ అనిపించలేదు..

కరెక్ట్ అనిపించలేదు..

'నేనో అంతర్జాతీయ ప్లేయర్‌ను.. నాకు అక్కడ జరిగేది కరెక్ట్ అనిపించలేదు. నాకు చెప్పింది ఏదీ అక్కడ జరగలేదు. నేనో నెట్ బౌలర్ అని, ఎవరైనా గాయపడితే ఆడే అవకాశం ఉందని చెప్పారు. కానీ కనీసం నాకు బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ట్రైనింగ్‌లో ఒక రెండు ఓవర్లు వేయించి పక్కన కూర్చోబెట్టే వాళ్లు. ఈ రెండు ఓవర్లు వేయడానికా సగం ప్రపంచం దాటి వచ్చాను? అనిపించింది. లంకన్ ప్రీమియర్ లీగ్, టీ10 లీగుల్లో రాణించే సరికి నాకు మంచి విలువ ఉంటుందని అనుకోవడం నాదే తప్పేమో? అమాయకంగా ఆలోచించానేమో?' అని లిటిల్ అన్నాడు.

చెన్నై నన్ను కొనదు..

చెన్నై నన్ను కొనదు..

అక్కడ ఉన్న మిగతా ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడలేదు కాబట్టి, వాళ్లు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదని లిటిల్ వివరించాడు. స్లింగర్స్ అలిసిపోయినప్పుడు బౌలింగ్ చేసే నెట్‌బౌలర్ అని తెలిసినప్పుడు 'ఛీ.. ఇక్కడి నుంచి నన్ను పంపేయండి' అనుకున్నట్లు లిటిల్ చెప్పాడు. అందుకే తను మధ్యలోనే చెన్నై సూపర్ కింగ్స్‌ను వదిలేసి వెళ్లిపోయానని వెల్లడించాడు. కాబట్టి మళ్లీ తనను వాళ్లు కొంటారనే ఆశ కూడా తనకు లేదన్నాడు. అయితే ఈ ఏడాది మరో మంచి ఫ్రాంచైజీకి చేరతానని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Story first published: Thursday, December 22, 2022, 18:17 [IST]
Other articles published on Dec 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+