రిటైర్‌మెంట్‌పై హింట్ ఇచ్చిన స్టార్ ఓపెనర్.. ముందుగా ఆ ఫార్మాట్‌కే వీడ్కోలు!

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ షాకింగ్ వార్త చెప్పాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభాలు అందించడంలో విఫలమైన అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక వార్నర్ పని అయిపోయిందని, కొత్త వాళ్లను తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో తన రిటైర్‌మెంట్‌పై వార్నర్ హింట్ ఇచ్చేశాడు.

ముందుగా టెస్టు క్రికెట్‌కే..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. చాలా ఎక్కువ టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ కూడా జరగనుంది. అందుకే తాను ముందుగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటానని వార్నర్ అంటున్నాడు. 'నేను అనుకోవడం ముందుగా టెస్టు క్రికెట్ వదిలేస్తా. నేను అనుకోవడం టెస్టు క్రికెట్‌లో ఇవే నా ఆఖరి 12 సంవత్సరాలు' అని వార్నర్ చెప్పాడు.

వైట్ బాల్ క్రికెట్ అంటే ఇష్టం
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు.. కనీసం సెమీఫైనల్ కూడా చేరలేదు. అయితే వచ్చే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌పైనే తన ఫోకస్ ఉందని వార్నర్ చెప్పాడు. వచ్చే ఏడాదిలో జరిగే వన్డే ప్రపంకప్‌పై ఫోకస్ పెడతానన్న వార్నర్.. ఈ ఏడాది ప్రపంచకప్‌లో చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు.

ప్రపంచకప్‌పై ఫోకస్
'నాకు టీ20 ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. వచ్చే వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్ ఆడతానని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను ఆడలేదన్న వాళ్లంతా ఇక్కడి నుంచి నా ఆట చూడండి' అని తేల్చిచెప్పాడు. వన్డే ఫార్మాట్‌కు ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలకడంతో వార్నర్‌కే జట్టు పగ్గాలు అందించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తోంది. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అతనే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కూడా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications