న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని వాయిస్ రికార్డులు బయటపెట్టిన సోనీ నెట్‌వర్క్‌‌కు నో, ఆ స్థానంలో స్టార్ ఇండియా

Star India wins audio-visual production rights for IPL, BCCI domestic season

హైదరాబాద్: స్టార్‌ ఇండియా 2018-19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్‌ ఆడియో, వీడియో ప్రొడక్షన్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐదేళ్ల కాలానికి రికార్డు స్థాయిలో రూ.16,347 కోట్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను కైవసం చేసుకున్న స్టార్ మీడియా దేశవాళీ టోర్నీల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది.

'మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ ఆహ్వానించింది. దీంతో 2018-19 సీజన్‌కు గాను ఐపీఎల్, దేశవాళీ ఆడియో విజువల్ హక్కుల కోసం స్టార్ సంస్థ బిడ్‌ను దక్కించుకుందని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే ఎంత మొత్తంలో ఒప్పందం జరిగిందనేది బీసీసీఐ బయటికి వెల్లడించలేదు.

ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్‌ తెలిపారు. ఐపీఎల్‌ ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్‌ ప్రసార హక్కులను గతేడాది స్టార్‌ ఇండియా రూ.16 వేల 347 కోట్లకు దక్కించుకుంది.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత బౌలర్లకి ధోని సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి. అందులో మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా ఇద్దరు లేదా ముగ్గురు ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు ధోని సూచనలు చేశాడు. అంతేకాదు కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో టామ్‌ లాథమ్‌కి ఎటువంటి బంతులు వేయాలో కూడా హిందీలో చెప్పాడు. ఈ సరదా సన్నివేశాన్ని స్టార్ నెట్‌వర్క్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది.

Story first published: Tuesday, February 20, 2018, 17:21 [IST]
Other articles published on Feb 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X