Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2021: అది మా వ‌ల్ల కాదు.. యాషెస్ సిరీస్ ఎగ్గొట్టే ప్లాన్‌లో ఇంగ్లండ్‌!!

Star England players could Boycott Ashes Series 2021 due to Quarantine Rules in Australia

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌ మాదిరి టెస్టు క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌పై సైతం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ సిరీస్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. యాషెస్ 2021 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది.

అయితే దీనికి ముందు ఒక వార్త క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు యాషెస్ 2021 సిరీస్‌ను బహిష్కరించవచ్చంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంగ్లీష్ ప్లేయర్స్ అలా అనడానికి కారణం మాత్రం కఠినమైన క్వారంటైన్ నిబంధనలే అని తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలో క‌ఠిన ఆంక్ష‌లు

ఆస్ట్రేలియాలో క‌ఠిన ఆంక్ష‌లు

ఆస్ట్రేలియాను క‌రోనా వైరస్ మహమ్మారి వ‌ణికిస్తున్న వేళ అక్క‌డ క‌ఠిన ఆంక్ష‌లు అమల్లో ఉన్నాయి. విదేశాల నుంచి ఎవరు వెళ్లినా రెండు వారాల క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అదీకాకుండా ఐపీఎల్‌ 2021, టీ20 ప్రపంచకప్‌ 2021, యాషెస్‌ 2021 వరుసగా ఉన్నాయి. వీటి కారణంగా కొందరు ఇంగ్లండ్ ప్లేయర్స్ ఏకంగా నాలుగు నెల‌ల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉండాల్సి వ‌స్తోంది.

మూడు ఫార్మాట్లలో ఆడవారికి ఇది కష్టంగా మారనుంది. మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. అందుకే అన్ని రోజుల పాటు త‌మ కుటుంబాల‌తో స‌హా హోట‌ల్ గ‌దుల‌కే ప‌రిమితం కావ‌డం త‌మ వ‌ల్ల కాద‌ని కొందరు ఇంగ్లీష్ ప్లేయ‌ర్స్ అంటున్నారట. ఇదే విష‌యాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెప్పి యాషెస్ సిరీస్‌ 2021ను వాయిదా వేయాల‌ని కోరారని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది.

సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాలని

సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాలని

మొత్తం జట్టు పర్యటనను బహిష్కరించడానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదంటూ ఓ నివేదిక పేర్కొంది. ఇందులో కోచింగ్, సహాయక సిబ్బంది కూడా ఉన్నారట. అయితే ఈసీబీ మాత్రం యాషెస్‌ 2021 సిరీస్ వాయిదాకు స‌సేమిరా అంటోందట. దాంతో ప్లేయ‌ర్స్‌, స‌పోర్టింగ్ స్టాఫ్ అంతా క‌లిసి మూకుమ్మ‌డిగా సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అదే జ‌రిగితే సీనియ‌ర్ ప్లేయ‌ర్స్‌ను కాద‌ని సెకండ్ రేట్ టీమ్‌ను కూడా ఈసీబీ యాషెస్ కోసం పంపే చాన్స్ ఉంది. ఒకవేళ కెప్టెన్ జో రూట్ సిరీస్ ఆడను అంటే.. స్టువ‌ర్డ్ బ్రాడ్‌ లాంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్‌ను కెప్టెన్‌గా నియ‌మించ‌వ‌చ్చు. అయితే రూట్ ఐపీఎల్, ప్రపంచకప్‌ ఆడడు కాబట్టి యాషెస్‌ 2021 సిరీసుకు ఎలాంటి అభ్యన్తరం చెప్పకపోవచ్చు.

CPL 2021 Final: డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డు.. టీ20ల్లో రెండో క్రికెటర్‌గా!!

ట్రైనింగ్ కోసం మాత్రమే

ట్రైనింగ్ కోసం మాత్రమే

కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్నాయి. దాంతో ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ పూర్తిగా హోట‌ల్ రూమ్స్‌కే ప‌రిమితం కావాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే స్ప‌ష్టం చేసింది. గోల్డ్ కోస్ట్‌లోని రిసార్ట్ హోట‌ల్‌లో ప్లేయ‌ర్స్ గ‌డ‌ప‌డానికి అవ‌కాశం ఇవ్వొచ్చ‌ని వార్త‌లు వ‌చ్చినా.. తాజాగా ఆ చాన్స్ లేద‌ని, కేవ‌లం ట్రైనింగ్ కోసం మాత్రమే రెండు, మూడు గంట‌ల‌ పాటు హోట‌ల్ రూమ్స్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి అనుమ‌తి ఇస్తున్నార‌ని తెలిసింది.

క‌ఠిన‌మైన బ‌బుల్‌పై ఎప్పటినుంచో ప్లేయ‌ర్స్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ప్లేయర్స్ ఇటీవలే భారత్ పర్యటనను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా క్రికెటర్లు అందరూ బ‌బుల్‌లో ఉంటున్నారు.

Story first published: Thursday, September 16, 2021, 12:24 [IST]
Other articles published on Sep 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+