Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక దబిడిదిబిడే!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో తమ ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని స్టేడియంలో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే మోకాలి గాయం కారణంగా ధోనీ జట్టుకు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం వస్తున్న కొన్ని నివేదికల ప్రకారం.. ధోనీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని, ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎస్కే ఆడబోయే చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్త నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది.

లక్నోతో జరిగిన మ్యాచ్ సమయానికే ధోనీ ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. అయితే జట్టు విన్నింగ్ కాంబినేషన్‌ను దెబ్బతీయడం ఇష్టం లేకనే ధోనీ ఆ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత సీఎస్కే జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.ఇలాంటి సమయంలో జట్టు సమతుల్యతను మార్చడం కరెక్ట్ కాదని ధోనీ భావించాడు. కానీ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూడటంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి చివరి రెండు మ్యాచ్‌ల్లో ధోనీని ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

MS Dhoni Injury Update Will CSK Legend Play Last Two Matches of IPL 2026 Full Details

ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేకు ఈ సీజన్లో గాయాల సమస్య పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే దాదాపు అర డజను మందికి పైగా కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఆ జాబితాలో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లతో జరగబోయే ఆఖరి రెండు హోరాహోరీ మ్యాచ్‌ల్లో ఆడి, తన ఐపీఎల్ కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే.. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి 6వ స్థానంలో కొనసాగుతోంది. సీఎస్కే జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. అలా గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేవలం గెలవడమే కాకుండా రన్ రేట్ ) మెరుగ్గా ఉండేలా చూసుకోవడం కూడా చెన్నై జట్టుకు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మరి ధోనీ మైదానంలోకి అడుగుపెట్టి తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేరుస్తాడో లేదో చూడాలి.

Story first published: Sunday, May 17, 2026, 14:03 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+