Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్ నిశ్చితార్థం.. బోటులో రొమాంటిక్ ప్రపోజల్!.. ఫోటోలు వైరల్

ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ ఆల్-రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన ప్రియురాలు సారా జర్నుక్‌తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సారా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తమ బంధానికి ఓ కొత్త మెట్టు వేసి పెళ్లికి సిద్ధమయ్యారు.

సుందరమైన తీరంలో ఉంగరం మార్చుకున్న లవర్స్
సెప్టెంబర్ 3, 2025న స్పెయిన్‌లోని సుందరమైన తీరంలో ఓ పడవపై స్టోయినిస్ సారాకు ప్రపోజ్ చేసినట్లు సారా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ అద్భుతమైన క్షణాన్ని వర్ణిస్తూ "నా జీవితంలో అత్యంత సులభమైన 'అవును' చెప్పాను" అని సారా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేమ జంట తమ ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. సారా జర్నుక్ స్టోయినిస్‌కు మద్దతు ఇవ్వడానికి చాలాసార్లు క్రికెట్ స్టేడియాల్లో కనిపించారు. వీరిద్దరూ తరచుగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానుల ప్రేమను పొందుతూ ఉంటారు. వృత్తిరీత్యా సారా జర్నుక్ ఒక ఆస్ట్రేలియన్ మోడల్, అలాగే ఫ్యాషన్ డిజైనర్ కూడా.

Star Cricketer Marcus Stoinis Engaged to Partner Sara Zarnuk Romantic Proposal Photos Go Viral

స్టోయినిస్ కెరీర్లో కీలక మలుపులు
స్టోయినిస్ తన జీవితంలో ఈ సంతోషకరమైన మార్పుతో పాటు.. తన వృత్తిపరమైన జీవితంలో కూడా ఈ ఏడాది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీ20 క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2015లో మొదలైన స్టోయినిస్ వన్డే కెరీర్లో 71 మ్యాచ్‌లలో 26.7 సగటుతో 1,495 పరుగులు చేశారు. ఇందులో 146 పరుగుల సెంచరీ కూడా ఉంది. బౌలింగ్‌లో 48 వికెట్లు తీసి జట్టుకు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా 2023లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ ఒక కీలక సభ్యుడు. 2018-19లో 'ఆస్ట్రేలియా ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికవ్వడం అతని ప్రతిభకు మరో నిదర్శనం.

టీ20, ఐపీఎల్‌లో స్టోయినిస్ దూకుడు
వన్డేల నుంచి వైదొలిగిన తర్వాత స్టోయినిస్ ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో మరింత దూకుడుగా ఆడుతున్నాడు. 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 148.57 స్ట్రైక్ రేట్‌తో 1245 పరుగులు, 45 వికెట్లు తీశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా స్టోయినిస్ ఒక కీలక ఆటగాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన స్టోయినిస్.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ, తన ఆల్-రౌండ్ ప్రదర్శనతో జట్టుకు గొప్ప బలాన్ని ఇస్తున్నాడు.

Story first published: Tuesday, September 9, 2025, 11:30 [IST]
Other articles published on Sep 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+