Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని జోస్ బట్లర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించాడు. "రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్" అని జోస్ బట్లర్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫోటోను జోస్ బట్లర్ షేర్ చేశాడు. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా.. జాన్ బట్లర్ ఆత్మకు శాంతి కలగాలని.. జోస్ బట్లర్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కాంక్షిస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Star Cricketer Jos Buttler Faces Tragic Loss Father John Buttler Passes Away

ఈ విషాద సమయంలో కూడా జోస్ బట్లర్ ది హండ్రెడ్ టోర్నీలో తన జట్టు అయిన మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున ఆడారు. జోస్ బట్లర్ తండ్రికి నివాళిగా జట్టు సభ్యులందరూ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్ లో నాలుగు బంతులను ఎదుర్కొన్న జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

Story first published: Monday, August 11, 2025, 16:23 [IST]
Other articles published on Aug 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+