Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్‌కు నెలల ముందు షాకిండ్ డెసిషన్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ బ్యాటర్!

మరికొన్ని నెలల్లో వన్డే వరల్డ్ కప్‌ మొదలవుతుంది. ఈ ట్రోఫీని ముద్దాడాలని క్రికెట్ ఆడే ప్రతి దేశం కోరుకుంటుంది. అందుకోసమే కీలకమైన ఆటగాళ్లను సిద్ధం చేస్తుంది కూడా. కానీ మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇలాంటి పరిస్థితి లేదు. వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు రెడీ అవుతున్న ఈ సమయంలో ఆ టీంకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టాప్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

2007లో బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన తమీమ్.. ఈ ఫార్మాట్లో 14 సెంచరీలు చేశాడు. వన్డేల్లో ఇన్ని శతకాలు మరే ఇతర బంగ్లా బ్యాటర్ చేయలేదు. గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన అతను వరల్డ్ కప్‌కు నెలల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులకు షాకిచ్చింది. అంతేకాదు, ఈ విషయం ప్రకటించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో తమీమ్ కన్నీరు పెట్టుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

Tamim Iqbal

'ఇది నా కథకు ముగింపు. ఇంత వరకు నేను నా బెస్ట్ ఇచ్చారు. ఇక ఈ క్షణం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. నా టీంమేట్స్, కోచ్‌లు, బీసీబీ అధికారులు, కుటుంబ సభ్యులు, నా ప్రయాణంలో నాతో పాటు నడిచి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అభిమానుల ప్రేమ, నమ్మకం వల్లనే నేను రాణించగలిగా.. వారికి నా కృతజ్ఞతలు' అని తమీమ్ చెప్పాడు.

'జీవితంలో నా తర్వాతి ఛాప్టర్‌లో కూడా మీ అందరి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా' అంటూ ఎమోషనల్ అయిపోయాడీ బంగ్లా లెజెండ్. బంగ్లాదేశ్ తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. వన్డేల్లో బంగ్లా తరఫున అత్యధిక పరుగులు చేసింది ఇతనే. టెస్టుల్లో కూడా అద్భుతంగా రాణించిన తమీమ్.. తన కెరీర్‌లో 5134 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బంగ్లా బ్యాటర్‌గా రికార్డు కూడా సృష్టించాడు.

Story first published: Thursday, July 6, 2023, 18:33 [IST]
Other articles published on Jul 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+