Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: మ్యాచ్ జరుగుతుంటే నిద్రపోతున్న స్టార్ బ్యాటర్..ఫొటోలు వైరల్!

Star batter caught napping during INDvsAUS third test

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే ట్రోఫీ రిటైన్ చేసుకున్న భారత్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటో మరో మ్యాచ్ గెలవాలి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టింది.

 బెడిసి కొట్టిన రోహిత్ ప్లాన్..

బెడిసి కొట్టిన రోహిత్ ప్లాన్..

ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచి, వారిని ఒత్తిడిలోకి నెట్టాలని అనుకున్న భారత వ్యూహం దారుణంగా దెబ్బతింది. కొత్త బంతికి పిచ్ నుంచి మంచి సహకారం అందడంతో ఆసీస్ బౌలర్లు చెలరేగారు. ఈ ధాటికి తడబడిన భారత బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. విరాట్ కోహ్లీ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో భారత జట్టు కేవలం 109 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఆసీస్ కొత్త కుర్రాడు కునేమన్ ఏకంగా ఐదు వికెట్లతో రాణించాడు.

రాణించిన ఆసీస్..

రాణించిన ఆసీస్..

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ ఆసీస్‌కు మంచి స్కోరు అందించారు. ఖవాజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

లబుషేన్ మధ్యలో ఒకసారి జడేజా వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకొని అవుటయ్యాడు. కానీ అది నోబాల్ అని తేలింది. దీంతో బతికిపోయాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన లబుషేన్.. ఖవాజాతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కాసేపు స్టీవెన్ స్మిత్ కూడా ఫర్వాలేదనిపించాడు.

కునుకు తీసిన స్టార్ బ్యాటర్..

ఇలా ఆస్ట్రేలియా టాపార్డర్ మైదానంలో చెమటోడుస్తుంటే.. ఆ జట్టు స్టార్ ఆటగాడు పీటర్ హాండ్స్‌కోంబ్ ఏం చేస్తున్నాడో తెలుసా? డగౌట్‌లో కూర్చొని నిద్రపోతున్నాడు. ప్యాడ్స్ కట్టుకొని మైదానంలోకి వచ్చేందుకు రెడీ అయిన అతను.. కుర్చీలో కూర్చొని, కళ్లపై టోపీ పెట్టుకొని ఒక కునుకు తీశాడు.

లబుషేన్, ఖవాజా మైదానంలో జడ్డూ, అశ్విన్‌లను ఎదుర్కోవడానికి కష్టపడుతున్నప్పుడే అతను ఇలా పడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఖవాజా, లబుషేన్ అవుటైన తర్వాత స్టీవెన్ స్మిత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ సమయంలో హాండ్స్‌కోంబ్, కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Story first published: Thursday, March 2, 2023, 11:10 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+